Amaravati : నిన్న అమరావతి పున: ప్రారంభకార్యక్రమం జరిగింది. మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాకిస్తాన్ తో యుద్ధానికి సిద్ధమవుతున్న వేళ సమయం చూసుకొని మోడీ రావడం ఒక శుభసూచికం. 2014లో ఒకసారి ప్రారంభించిన తర్వాత తిరిగి మళ్లీ చేయడం ఎంత వరకూ సబబు..అంటే..
రాష్ట్రానికి అమరావతి వంటి రాజధాని కావాలంటే కేంద్ర సహకారం అవసరం. అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం, పోలవరం నిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులు కేవలం కేంద్రంతో సఖ్యతతోనే జరిగింది.
ఓఆర్ఆర్ రోడ్డు కూడా ఏపీకి మణిహారంగా మారింది. ఏపీలో డబ్బులు లేవంటే భూసేకరణకు కూడా కేంద్రం స్వయంగా డబ్బులు ఇచ్చి ఈ ఓఆర్ఆర్ నిర్మాణానికి ముందుకు రావడం విశేషం. 25వేల కోట్ల రూపాయలను కేంద్రం పెట్టుకుంటూ 185 కి.మీల ఔటర్ రింగ్ రోడ్డును కేంద్రం స్వయంగా నిర్మిస్తోంది. ఇది కేవలం కేంద్రమే చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు ఇది జరిగింది.
అమరావతి పున: ప్రారంభంతో ఆంధ్రా దశ దిశ తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
