Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన సాంగ్స్, టీజర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ శంకర్ నుండి గత పదేళ్లుగా ఎలాంటి కంటెంట్ ని అయితే ఆడియన్స్ మిస్ అవుతున్నారో, ఆ కంటెంట్ మొత్తం వడ్డీ తో కలిపి ‘గేమ్ చేంజర్’ చిత్రం తో ఇవ్వబోతున్నాడని ఈ ప్రమోషనల్ కంటెంట్స్ చూసిన తర్వాత అభిమానులు చెప్తున్నారు. అంతే కాకుండా డల్లాస్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా బంపర్ రెస్పాన్స్ వచ్చింది. న్యూ ఇయర్ రోజున ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇది ఇలా ఉండగా డిసెంబర్ 30 వ తారీఖున ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఈ ట్రైలర్ కోసం ట్రేడ్ ఎంతగానో ఎదురు చూస్తుంది. టీజర్, పాటలను చూసి ఫ్యాన్స్, ఆడియన్స్ ఒక అంచనా కి అయితే వచ్చారు కానీ, సినిమా కంటెంట్ ఏమిటి అనేది మాత్రం పూర్తిగా తెలియలేదు. థియేట్రికల్ ట్రైలర్ పర్ఫెక్ట్ గా ఉంటే, ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కి మంచి బూస్ట్ ని ఇచ్చినట్టు ఉంటుంది. అందుకే థియేట్రికల్ ట్రైలర్ ని అద్భుతంగా ఉండేట్టు చూసుకుంటున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన వర్క్ కూడా పూర్తి అయ్యిందట. ఇది కాసేపు పక్కన పెడితే, ఈ చిత్రానికి సంబంధించిన తమిళ థియేట్రికల్ రైట్స్ ని భారీ రేట్ కి అమ్ముడుపోయినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. అక్కడి ట్రేడ్ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట.
అంటే ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ అవ్వాలంటే కచ్చితంగా 45 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రానికి ఇక్కడ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 8 కోట్ల రూపాయలకు జరిగింది. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి అంతకు రెండు రెట్లు ఎక్కువ బిజినెస్ జరిగింది. వాస్తవానికి శంకర్ రేంజ్ కి ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. ఆయన రేంజ్ కి కనీసం 50 కోట్ల రూపాయలకు తమిళం థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయని అనుకున్నారు. కానీ ఆయన గత చిత్రం ‘ఇండియన్ 2 ‘ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ఎఫెక్ట్ ఈ సినిమా మీద చాలా గట్టిగా పడింది. కానీ హిట్ టాక్ వస్తే ‘గేమ్ చేంజర్’ చిత్రం కేవలం తమిళనాడు నుండి వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబడుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు అక్కడి ట్రేడ్ పండితులు.