spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Vijayaamma Letter Impact On YCP: విజయమ్మ లేఖతో డ్యామేజ్.. రోజాతో చెక్!

Vijayaamma Letter Impact On YCP: విజయమ్మ లేఖతో డ్యామేజ్.. రోజాతో చెక్!

Vijayaamma Letter Impact On YCP: ఉగాది నాడు వైసిపి కార్యాలయంలో పంచాంగ శ్రవణం జరిగింది. ఈ ఏడాది జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy) కష్టాలు ఉంటాయని పండితులు చెప్పుకొచ్చారు. అలా చెప్పిన గంటల వ్యవధిలోనే విజయమ్మ బాంబు పేల్చారు. తన కుమార్తె షర్మిల పిల్లలకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారు అంటూ ఆమె లేఖ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలకు దారితీస్తోంది. దీంతో ఇప్పటివరకు ఒక ఎత్తు. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు పరిస్థితి మారింది. విజయమ్మ లేఖతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సైతం ఆశ్చర్యం వ్యక్తం అయింది. నేరుగా తల్లి విజయమ్మ దేవుడిపై ప్రమాణం వేస్తూ లేఖ రాయడం చూస్తుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి భారీ డ్యామేజ్ కలుగుతుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!

* వారి భార్యల గురించి ప్రస్తావన..
ఉగాది నాడు జగన్మోహన్ రెడ్డి దంపతులు వేడుకలకు హాజరయ్యారు. అంతవరకు ఓకే. దానిని ప్రచారం చేసుకోవచ్చు కానీ.. చంద్రబాబుతో( CM Chandrababu) పాటు పవన్ కళ్యాణ్ భార్యల గురించి రోజా ప్రస్తావించారు. వారు ఎందుకు సతి సమేతంగా ఉగాది వేడుకలు జరుపుకోవాలని ప్రశ్నించారు. తద్వారా ఏదో ఆశించి రోజా వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతుంది. అయితే విజయమ్మ లేఖతో పొలిటికల్ డామేజ్ కంట్రోల్ లో భాగంగా.. మాజీ మంత్రి రోజాను తెరపైకి తీసుకువచ్చారని అర్థమవుతోంది. కచ్చితంగా రోజా మాటలు చూసి టిడిపి తో పాటు జనసేన శ్రేణులు రియాక్ట్ అవుతాయి. అప్పుడు విజయమ్మ లేఖ అంశం పక్కకు వెళ్ళిపోతుందనేది వైసిపి ఆలోచనగా స్పష్టమవుతోంది. ఇప్పటికే హిందూ పండుగలకు భార్య భారతి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి తీసుకురారు అనేది ఏపీ ప్రజల్లో బలంగా ఉంది. అటువంటప్పుడు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ భార్యల గురించి రోజా ప్రస్తావించడం మాత్రం సహేతుకం కాదు. కేవలం విజయమ్మ లేఖతో జరిగిన డ్యామేజ్ కంట్రోల్ కోసమే రోజాను రంగంలోకి దించినట్లు అర్థమవుతోంది.

* మాజీ మంత్రుల మౌనవ్రతం
గత కొద్ది రోజులుగా పరిణామాలను గమనిస్తే మాజీ మంత్రులంతా మౌనం పాటిస్తున్నారు. చివరకు అంబటి రాంబాబు సైతం సైలెంట్ గానే ఉంటున్నారు. పేర్ని నాని పెద్దగా కనిపించడం లేదు. ఇటువంటి సమయంలో రోజాను( RK Roja) మళ్ళీ తెరపైకి తెచ్చారు. మహిళా నేతల విషయంలో కూటమి ప్రభుత్వం పాలసీ పెట్టుకుంది. కానీ దానిని అలుసుగా తీసుకుంటున్నారు మాజీ మంత్రి రోజా. అయితే ఇప్పుడు రోజా లాంటి వారితో మహిళల గురించి ప్రస్తావించడం కూడా జగన్ కు మైనస్. కానీ అంతకుమించి విజయమ్మ లేఖ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సెగలు పుట్టిస్తోంది. అందుకే రోజా అవసరం వారికి ఏర్పడింది. అయితే విజయమ్మ లేఖ ప్రస్తావనతో ప్రతిపక్షాలకు ఆయుధం దొరికింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరింత డ్యామేజ్ పెరుగుతోంది. మరి దీనిని ఎలా నియంత్రించుకుంటారో జగన్మోహన్ రెడ్డికే ఎరుక.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular