Vijaya Sai Reddy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటుతో పాటు మీడియా సంస్థను ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల దానిపై క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఏ రాజకీయ పార్టీలో ఆయనకు ప్రవేశం లేకపోవడంతోనే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు అనేది ఒక ప్రచారం. కచ్చితంగా ఆయన పార్టీ పెడతానని తాజాగా ప్రకటించారు. మీడియా సంస్థను సైతం ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే డిజిటల్ మీడియాను ఏర్పాటు చేసి.. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని చెప్పారు ఆయన. అయితే ఇందులో ఏం చెప్పలేం కానీ ఆయన ఒకటి కాదు మూడు టీవీ చానల్స్ పెడతారని తాజాగా స్పష్టత వచ్చింది. ఏకంగా మూడు భాషల్లో ఆయన కొత్త డిజిటల్ మీడియా ఛానల్స్ రాబోతున్నాయి అనేది పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
* జగన్ కు అత్యంత సన్నిహితుడిగా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 గా ఎదిగారు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy). జగన్మోహన్ రెడ్డికి ఆడిటర్ గా వ్యవహరించిన ఆయన.. ఆయన అవినీతి కేసుల్లో సైతం చిక్కుకున్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకు కూడా వెళ్లారు. 16 నెలల జైలు జీవితం కూడా అనుభవించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో కూడా క్రియాశీలక పాత్ర పోషించారు. తొలుత పార్టీ ప్రతిపక్షంలో నిలిచింది. తరువాత అధికారంలోకి వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు విజయసాయిరెడ్డి. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థాయిలో గౌరవం దక్కించుకున్నారు. పదవులు అలంకరించారు. అయితే మొన్నటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. జగన్ చుట్టూ కోటరి నడుస్తోందని ఆరోపిస్తూ పార్టీ నుంచి బయటపడ్డారు. ఇకనుంచి రాజకీయాలు చేయనని.. వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు.
* మనసు మార్చుకున్న వైనం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఏడాది తిరగకముందే మనసు మార్చుకున్నారు విజయసాయిరెడ్డి. మళ్లీ రాజకీయాల్లోకి రావడం ఏ కాదు మీడియా సంస్థలను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కానీ ఆయనకు కూటమి పార్టీల్లో ఛాన్స్ దక్కకుండా పోయింది. అలాగని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచనను ఇటీవల బయటపెట్టారు. అందుకు సంబంధించిన సన్నాహాలను కూడా ప్రారంభించారు. ఇంకోవైపు మీడియా ఛానల్స్ ఏర్పాటులో కూడా తల మునకలై ఉన్నారు. అయితే ఆయన పెడుతున్నది ఒక్క ఛానల్ కాదు. మూడు మీడియా ఛానళ్ల ను ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఒకటి తెలుగులో.. రెండు హిందీలో.. మూడు ఇంగ్లీషులో ఛానల్స్ పెడతారు అనేది ఒక ప్రచారం. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.