Homeఆంధ్రప్రదేశ్‌Vijaya Sai Reddy : ఆత్మరక్షణలో వైఎస్సార్ కాంగ్రెస్.. విజయసాయిరెడ్డి పై ఆ నేతలతో విమర్శలు!

Vijaya Sai Reddy : ఆత్మరక్షణలో వైఎస్సార్ కాంగ్రెస్.. విజయసాయిరెడ్డి పై ఆ నేతలతో విమర్శలు!

Vijaya Sai Reddy : విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) తీరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆత్మరక్షణలో పడింది. కొద్దిరోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు రాజ్యసభ పదవికి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి వ్యవసాయం చెప్పిన ఆయన యూటర్న్ తీసుకున్నారు. కాకినాడ సి పోర్టు వాటాల బదలాయింపు విషయంలో సిఐడి నోటీసులు అందుకున్నారు. విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైసీపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకున్నాక సైలెంట్ అయిపోతారని.. తాను చెప్పినట్లు వ్యవసాయం చేసుకుని బతికేస్తారని భావించారు. కానీ ఆయన షాక్ ల మీద షాక్ లు ఇస్తూనే ఉన్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో పాలు పోవడం లేదు.

Also Read : జనసేన ప్లీనరీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఊహించని చేరికలు!

* రాజశేఖర్ రెడ్డి కుటుంబ విధేయుడు.
వాస్తవానికి విజయసాయిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి( y s Rajasekhar Reddy family ) అత్యంత ఆత్మీయుడు. ఆ కుటుంబానికి ఆడిటర్ గా పనిచేసేవారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కంపెనీల వ్యవహారాన్ని చూసుకునేవారు. దీంతో ఆ కుటుంబ ఆర్థిక వ్యవహారాలన్నీ విజయసాయి రెడ్డికి తెలుసు. కానీ రాజకీయపరంగా ఒత్తిడో.. లేకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆదరణ తగ్గిందో తెలియదు కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. వ్యవసాయానికి పరిమితం అవుతానని బహిరంగ ప్రకటన చేశారు. అయితే దానికి కట్టుబడి ఉండకుండా ఎప్పుడు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

* తీవ్ర అసంతృప్తి
తాజాగా విజయసాయిరెడ్డి కామెంట్స్ చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీపై అసంతృప్తితోనే ఆయన బయటకు వచ్చినట్లు అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డిని వదిలేసి చుట్టూ ఉన్న కోటరీ పై ఆయన విమర్శలు చేయడం చూస్తుంటే వ్యూహాత్మకమైన అని తెలుస్తోంది. ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని టార్గెట్ చేయడం మాత్రం వారితో విజయసాయిరెడ్డి ఇబ్బందులు పడినట్లు అర్థమవుతోంది. వై వి సుబ్బారెడ్డి తో ఆయనకు పతాకస్థాయిలో విభేదాలు ఉన్నట్లు స్పష్టమైంది.

* అందుకే ఆ నేతలతో విమర్శలు
అయితే విజయసాయిరెడ్డి నుంచి ఈ తరహా ఆరోపణలు రావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడింది. విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసింది వైవి సుబ్బారెడ్డి తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి పై అని తేలింది. కానీ వారు వెంటనే రియాక్ట్ అయితే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, గుడివాడ అమర్నాధులతో మాట్లాడించినట్లు తెలుస్తోంది

Also Read : ఆ మాజీ మంత్రికి అరెస్టు భయం!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular