Vijaya Sai Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిది( Vijaya Sai Reddy ) విచిత్ర వైఖరి. ప్రతిసారి ఆయన మీడియాను ఏర్పాటు చేస్తానని.. రాజకీయాల్లో కిరీ ఎంట్రీ ఇస్తానని చెబుతుంటారు. అది కూడా ఆయనపై ఏదైనా కేసులు వెలుగులోకి వచ్చినప్పుడు.. విచారణలు జరిగినప్పుడు మాత్రమే. తాజాగా మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు 13 గంటల పాటు విచారణ చేపట్టింది. అయితే తర్వాత మీడియా ముందుకు వచ్చిన విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో మీడియా సంస్థను ఏర్పాటు చేయడంతో పాటు రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించారు. ఇలా ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలాసార్లు ఇటువంటి ప్రకటనలే చేశారు విజయసాయిరెడ్డి.
* తప్పనిసరి పరిస్థితుల్లోనే..
తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీని వీడాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వెంట నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఆయన గురించి తెలియంది కాదు ఏపీ ప్రజలకు. ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి పాలన వరకు ఒక రకమైన దోపిడీతో పాటు అవినీతికి ఆర్కిటెక్ట్ గా వ్యవహరించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. వైయస్ కుటుంబమే కాదు ఆయన సైతం ఎంతోకొంత వెనుకేసుకున్నారు. భారీగానే లబ్ది పొందారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు కానీ ఆ వాసనలు పోలేదు. అందుకే ఇప్పుడు కొత్త మీడియా సంస్థ ఏర్పాటుతో పాటు కొత్త పార్టీ ప్రకటన చేస్తున్నారు.
* తొలుత గుట్టు విప్పి..
మద్యం కుంభకోణం( liqour scam ) గుట్టు విప్పింది విజయసాయిరెడ్డి. అదేదో కాకినాడ పోర్టు వ్యవహారంపై విచారణకు హాజరైన ఆయన బయటకు వచ్చి మరి మద్యం కుంభకోణం వివరాలను బయటపెట్టారు. రాజ్ కసిరెడ్డి అసలైన సూత్రధారుడు అంటూ చెప్పుకొచ్చారు. మద్యం కుంభకోణం సిట్టింగ్లలో సైతం తాను పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు. అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనను అరెస్టు చేయలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు కేంద్రానికి సంబంధించిన ఈడి ఎంట్రీ ఇచ్చింది. ఈడీ అధికారులు విచారణ చేపట్టే సరికి.. బయటకు వచ్చినా ఆయన మరోసారి మీడియా సంస్థతో పాటు రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ప్రస్తావించారు. అయితే విజయసాయిరెడ్డి పరిస్థితి చూస్తుంటే మీడియాను ఏర్పాటు చేసి తన పని తాను చేస్తానని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీ అంటారా? ఎలాను వైసీపీలో తాను క్రియాశీలక పాత్ర పోషించానని.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డాను అన్న ధీమాతో.. కొత్త పార్టీ ఏర్పాటుపై తరచూ ప్రకటనలు చేస్తున్నారు. అంతకుమించి ఏమీ లేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.