Homeఆంధ్రప్రదేశ్‌Vijaya Sai Reddy Tweets: హిందుత్వవాదం, సనాతన ధర్మం.. విజయసాయిరెడ్డి సంచలనం!

Vijaya Sai Reddy Tweets: హిందుత్వవాదం, సనాతన ధర్మం.. విజయసాయిరెడ్డి సంచలనం!

Vijaya Sai Reddy Tweets: వైసిపి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ( Vijaya Sai Reddy )రాజకీయ ప్రయాణం పై రకరకాల చర్చ నడుస్తోంది. పార్టీకి రాజీనామా చేసిన వెంటనే ఆయన బిజెపిలో చేరిపోతారని ప్రచారం సాగింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. మధ్యలో పవన్ పై సానుకూల వ్యాఖ్యలు చేయడంతో జనసేనలో చేరతారని కూడా చర్చ. కానీ గత కొంతకాలంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం బిజెపిలో చేరడం ఖాయమని తెలుస్తోంది. ముఖ్యంగా హిందుత్వ వాదానికి సంబంధించిన కామెంట్స్ ఆయన ఎక్కువగా చేస్తున్నారు. పవన్ సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ రావాలని కోరుకున్న సంగతి తెలిసిందే. దానికి మద్దతు తెలుపుతున్నట్లు విజయసాయిరెడ్డి కామెంట్స్ ఉన్నాయి. అయితే ఆయన జనసేనలో చేరే ఉద్దేశం కాదు కానీ.. కూటమి పార్టీలు తన పట్ల సానుకూలత చూపితేనే బిజెపిలోకి లైన్ క్లియర్ అవుతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఇప్పుడు హిందుత్వవాదంపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో వైసిపి హయాంలో మతమార్పిడులు ఎక్కువగా జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. అటువంటి అర్థం వచ్చేలా మాట్లాడారు విజయసాయిరెడ్డి. తాజాగా హిందూ మతానికి సంబంధించిన ధార్మిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరారు విజయసాయిరెడ్డి. దీంతో పూర్తిగా బిజెపి లైన్ లో మాట్లాడినట్లు అర్థమవుతోంది.

పార్టీలో నెంబర్ 2 గా ఉంటూ..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో ఒక వెలుగు వెలిగారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి తరువాత ఆ పార్టీలో ఆయనదే కిరోల్. పార్టీ పెట్టడంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కూడా కృషి చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన ప్రభావం చాటుకున్నారు. కానీ వైసీపీ ఓడిపోయిన తరువాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే తరచూ రాజకీయ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూటమి పార్టీలకు అనుకూలంగా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి.

ఆ అడ్డంకులు లేకుండా..
అయితే వైసీపీ నుంచి చేరికల విషయంలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన నుంచి అభిప్రాయాలు తీసుకుంటుంది బిజెపి. ఇటువంటి సమయంలోనే విజయసాయిరెడ్డి చేరిక విషయంలో కూటమి నుంచి అడ్డంకులు వచ్చినట్లు సమాచారం. ప్రధానంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట చెల్లుబాటు అవుతుంది. ఆయన పర్మిషన్ ఇస్తేనే విజయసాయిరెడ్డిని బిజెపి చేర్చుకునే అవకాశం ఉంది. అందుకే బిజెపి హిందుత్వ వాదానికి దగ్గరగా.. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు దగ్గరగా మాట్లాడుతున్నారు విజయసాయిరెడ్డి. పవన్ కళ్యాణ్ నుంచి అభ్యంతరాలు లేకుండా.. బిజెపిలో చేరేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే కనీసం ఎన్నికల ముంగిటయినా విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని మాత్రం స్పష్టం అవుతుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version