Vijaya Sai Reddy : వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు కంటిమీద కునుకు కూడా లేదు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట ఆయన ఏం గుట్టు విప్పుతారో అన్న ఆందోళన వెంటాడుతోంది. మొన్నటికి మొన్న ఓ కేసు విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డి అంటూ తేల్చి చెప్పారు. అవసరం అయితే తన దగ్గర ఆధారాలు ఉన్నాయని.. విచారణ అధికారులకు ఇస్తానని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ కామెంట్స్ ను ప్రాతిపదికగా తీసుకొని ప్రత్యేక దర్యాప్తు బృందం విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 18న విచారణకు హాజరుకావాలని సూచించింది.
Also Read : మొన్న కలెక్టర్ల రివ్యూ.. ఇప్పుడు క్యాబినెట్ భేటీ.. పవన్ ఎందుకలా?
* పక్కా ఆధారాలతో
అయితే గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పాలనలో విజయసాయి రెడ్డికి తెలియకుండా ఏమీ జరగదు. కచ్చితంగా మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి. పైగా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటరీ పై ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ నుంచి బయటకు తాను వెళ్లిపోయే విధంగా ఆ కోటరి వ్యవహరించింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా ఆ కోటరిని నియంత్రించుకుంటేనే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. ఆ కోటరీలో ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి నేతలు ఉన్నారు. కచ్చితంగా వారిని ఇరికించే విధంగా విజయసాయిరెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆధారాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
* లిక్కర్ స్కాంతో సంబంధాలు..
వాస్తవానికి విజయసాయిరెడ్డి కుటుంబానికి సైతం లిక్కర్ స్కాంతో( liquors come ) సంబంధాలు ఉన్నాయన్నది ప్రధాన ఆరోపణ. ఆయన అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే అప్రూవర్ గా మారారు. అయితే అప్పుడు అదే శరత్ చంద్రారెడ్డి ద్వారా అదాని డిస్టలరీస్ ఏర్పాటు చేసి అడ్డగోలుగా మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు అన్నది ప్రధాన ఆరోపణ. ఈ లెక్కన లిక్కర్ స్కాం లో ఎక్కువగా ప్రయోజనం పొందింది విజయసాయిరెడ్డి అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దొంగే దొంగ అన్నట్టు ఉంది విజయసాయిరెడ్డి పరిస్థితి ఉందని చెప్పుకొస్తున్నారు.
* కేసుల భయంతోనే..
అయితే ప్రస్తుతం విజయసాయిరెడ్డి సాక్షిగా ఈ కేసు విచారణకు వెళ్తున్నారా? లేకుంటే అప్రూవర్ గా( approvar) మారారా? అన్నది తెలియాల్సి ఉంది. కేసుల భయంతోనే విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిని కూటమి పార్టీలు నమ్మడం లేదు. మరోవైపు ఈనెల 18న తనకు ముందుగా ఖరారు చేసుకున్న పనులు ఉన్నాయని.. అవసరం అనుకుంటే ఒకరోజు ముందుగా విచారణకు వస్తానని విజయసాయిరెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందానికి వర్తమానం పంపించడం విశేషం. సాధారణంగా విచారణ తేదీలను కొద్ది రోజులు పొడిగించాలని ఎక్కువమంది అడుగుతారు. కానీ విజయసాయిరెడ్డి ముందుగానే విచారణకు వస్తానని ముందుకు రావడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది.
Also Read : డీఎస్సీ నోటిఫికేషన్..జాప్యం అందువల్లే.. మంత్రి లోకేష్ ప్రకటన