Vijaya Sai Reddy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ పని అయిపోయిందన్న కామెంట్ ఇటీవల ప్రధానంగా వినిపిస్తోంది. ఆ పార్టీలో పని చేసిన వారి నుంచి ప్రత్యర్థుల వరకు ఇదే మాట చెబుతూ వస్తున్నారు. మొన్ననే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆలోచించాల్సిన పనిలేదని.. ఆ పార్టీ అధికారంలోకి రాదు.. ఆలోచించాల్సిన పనిలేదు అంటూ తేల్చి చెప్పారు. తాజాగా వైసీపీలో పని చేసిన విజయసాయిరెడ్డి సైతం అదే మాట అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆలోచించాల్సిన పనిలేదని చాలా తేలిగ్గా తీసుకున్నారు. కేఏ పాల్ అన్నారంటే ఒక అర్థం ఉంది కానీ.. విజయసాయి రెడ్డి అనేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సైతం షాక్ తగిలినట్లు అయింది.
* మొన్నటివరకు వైసీపీ విధేయుడిగా..
ప్రత్యేక పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కేసులతోపాటు ఇతరత్రా వేధింపులు ఉంటాయని భావించి ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టు అంతా అనుకున్నారు. ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విజయసాయిరెడ్డిని తమ పార్టీ వాడిగానే భావిస్తాయి. కానీ ఇప్పుడిప్పుడే విజయసాయిరెడ్డి వైసీపీ విషయంలో చాలా మాటలు చెబుతున్నారు. కూటమి ఉన్నంతకాలం వైసీపీకి ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు మొన్న ఆ మధ్యన. ఇప్పుడేమో వైసీపీ పని అయిపోయిందని కొత్త వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రత్యామ్నాయంగా మరో పార్టీకి స్పేస్ ఉందని చెప్పి.. తాను రాజకీయ పార్టీ పెడతానని తేల్చి చెప్పారు. ఒకవైపు కూటమిని విమర్శిస్తూనే అంతకుమించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన వైసిపి పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
* పొలిటికల్ డిఫెన్స్ లో..
విజయసాయిరెడ్డి పొలిటికల్ డిఫెన్స్ లో( political difference) ఉన్నారు. రాజకీయాలను వదిలేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన ఆయన ఆ పని చేయలేకపోయారు. అదేపనిగా రాజకీయాలు మాట్లాడుతునే ఉన్నారు. జగన్ చుట్టూ ఉన్న వారిపై విమర్శలు చేసి ఆయనను మాత్రం గౌరవంగా చూశారు. అదే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసుకున్న సమయంలో మాత్రం కాస్త దూకుడు ప్రదర్శించారు. కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత లేకపోయినా సైలెంట్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం పై మాత్రం ప్రశంసల జల్లు కురిపిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు రాజకీయ సలహాలు ఇస్తున్నారు అందరికీ. జూలైలో తన రాజకీయ రీ ఎంట్రీ ఉందని చెబుతున్నారు. ముందుగా మీడియాను ఏర్పాటు చేసి తర్వాత పార్టీని ఏర్పాటు చేస్తానన్న సంకేతాలు పంపుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీకి డామేజ్ జరుగుతోంది విజయసాయిరెడ్డి వల్ల. అయితే ఆయనకు ఏ పార్టీ ఆప్షన్ లేకపోవడం వల్లే చివరకు సొంతంగా పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చినట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.