https://oktelugu.com/

Vijayasai Reddy Vs RK: కమాన్ విజయసాయిరెడ్డి.. టైం, డేట్ చెప్పు.. వీపు పగిలిపోతుంది.. ఆర్కే మళ్ళీ రెచ్చిపోయాడు..

మద్యం, ఖనిజాల ఓనర్లను బెదిరించలేదని, తనకు ఆ అవసరం లేదని స్పష్టం చేసిన రాధాకృష్ణ.. తన పత్రికలో కొందరు పెట్టిన పెట్టుబడులకు సంబంధించి.. తన పత్రికలో గతంలో ఉన్న భాగస్వాముల గురించి విజయ సాయి రెడ్డి సంధించిన ప్రశ్నలకు రాధాకృష్ణ సమాధానం చెప్పలేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 24, 2024 / 10:03 AM IST

    Vijayasai Reddy Vs RK

    Follow us on

    Vijayasai Reddy Vs RK: రాజకీయ నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు సహజం. విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. కానీ తెలుగు రాష్ట్రాలు అందుకు భిన్నం కదా.. ఇక్కడ రాజకీయ నాయకుల మధ్య, మీడియా అధిపతుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. మీడియా ఆధిపతులకు రాజకీయ వాసనలు ఉండడం.. వారు ప్రచురించే వార్తలకు రాజకీయ రంగులు ఉండడంవల్ల ఇదంతా జరుగుతోంది. పైగా కొంతకాలంగా రాజకీయ నాయకులు ఒక అడుగు ముందుకేసి ఏకంగా మీడియా సంస్థలనే ఏర్పాటు చేశారు. తమ ప్రయోజనాల కోసం రాజకీయాన్ని, మీడియాను సయామీ కవలలను చేసేశారు.

    తాజాగా వేమూరి రాధాకృష్ణ వర్సెస్ విజయసాయిరెడ్డి మధ్య వైరం జరుగుతోంది.. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఓనర్ రాధాకృష్ణ గొడవలు కొత్త కాకపోయినా.. విజయ సాయి రెడ్డితో ఎక్కడ తేడా వచ్చింది? ఎందుకు వైరం మొదలైంది? సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకునే అవకాశం ఎందుకు వచ్చిందనేది ఇప్పటికీ తెలియడం లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తో, జగన్మోహన్ రెడ్డితో, కెసిఆర్ తో వైరం (నేరుగా కాదు) పెట్టుకున్నప్పటికీ ఈ స్థాయిలో రాధాకృష్ణ సవాళ్లు, ప్రతి సవాళ్ళు విసరలేదు. డేట్, టైం చెప్పు.. వస్తాను, మాట్లాడతాను, వీపు పగలగొడతాను అనే రేంజ్ లో ఎప్పుడు హెచ్చరించలేదు. కానీ ఆదివారం తన పత్రికలో రాసే కొత్త పలుకులో విజయ సాయి రెడ్డిని ఇలానే హెచ్చరించారు. తేడా వస్తే వీపు పగులుతుందని వార్నింగ్ ఇచ్చారు.”మద్యం, ఖనిజాల ఓనర్లను బెదిరించాను అంటున్నావ్.. ఒకవేళ అదే జరిగితే.. మీ ప్రభుత్వంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఒప్పుకున్నట్టే కదా! దీనికి సమాధానం చెప్పు విజయ సాయి రెడ్డి అని” రాధాకృష్ణ హెచ్చరించారు..” నువ్వు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డావు కాబట్టి చార్టెడ్ అకౌంటెంట్ అసోసియేషన్ నీకు నోటిస్ ఇచ్చింది నిజం కాదా? నీపై విచారణ జరగాలని ఆదేశించింది నిజం కాదా? వాటిపై నువ్వు స్టే తెచ్చుకొని? బయట ఉన్నది నిజం కాదా?” అంటూ విజయసాయిరెడ్డిని రాధాకృష్ణ దుయ్యబట్టారు.

    వాటికి సమాధానం ఏదీ?

    మద్యం, ఖనిజాల ఓనర్లను బెదిరించలేదని, తనకు ఆ అవసరం లేదని స్పష్టం చేసిన రాధాకృష్ణ.. తన పత్రికలో కొందరు పెట్టిన పెట్టుబడులకు సంబంధించి.. తన పత్రికలో గతంలో ఉన్న భాగస్వాముల గురించి విజయ సాయి రెడ్డి సంధించిన ప్రశ్నలకు రాధాకృష్ణ సమాధానం చెప్పలేదు. తన పత్రికలో గతంలో ఉన్న భాగస్వాములు ఎప్పుడు ఎందుకు బయటకు వెళ్లిపోయారో? ఎవరు పెట్టబడులు పెట్టారో క్లారిటీ ఇవ్వలేకపోయారు.. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేసే ఓ వ్యక్తి ఆంధ్ర జ్యోతిలో పెట్టుబడులు పెట్టారని.. ఆయన ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారని ఇటీవలి ట్వీట్ లో విజయసాయిరెడ్డి రాధాకృష్ణను ఉద్దేశించి ప్రశ్నించారు. అయితే ఆ విషయంపై కూడా రాధాకృష్ణ క్లారిటీ ఇవ్వలేదు. ఇక రాధాకృష్ణ ఈరోజు కొత్త పలుకులో నేరుగా వీపు పగులుతుంది అని హెచ్చరించారు కాబట్టి.. విజయసాయిరెడ్డి ఈరోజు ఏం ట్వీటుతారో.. ఇంకా ఇలాంటి విషయాలు చెప్తారో చూడాల్సి ఉంది. ఈ ఇద్దరి మధ్య గొడవ ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు కానీ.. ఈ ఇద్దరికి సంబంధించిన కొత్త కొత్త విషయాలు మాత్రం తెలుగు వాళ్లకు తెలుస్తున్నాయి. విజయసాయిరెడ్డి అంత పాపులర్ క్యారెక్టర్ కాదు గాని.. ఇక్కడ రాధాకృష్ణే అనవసరంగా పరువు పోగొట్టుకుంటున్నాడని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతున్నది.