https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: అయ్యా నాగార్జునా… కనీసం ఎపిసోడ్ అయినా చూస్తున్నారా? బిగ్ బాస్ హోస్ట్ పై ఫ్యాన్స్ ఫైర్

వారాంతం ప్రసారమయ్యే హోస్ట్ ఎపిసోడ్స్ కోసం ఆడియన్స్ లో భారీ ఆసక్తి ఉంటుంది. వారం మొత్తం హౌస్లో జరిగిన విషయాలపై హోస్ట్ నాగార్జున రివ్యూ నిర్వహిస్తాడు. తప్పు చేసిన వారిని హెచ్చరించడం, బాగా ఆడిన వారిని ప్రోత్సహించడం చేస్తారు. అయితే నాగార్జున జడ్జిమెంట్ సరిగా లేదని, పక్షపాత ధోరణిలో సాగుతుందనే వాదన గట్టిగా వినిపిస్తుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : November 24, 2024 / 10:23 AM IST

    Bigg Boss 8 Telugu(69)

    Follow us on

    Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ ప్రవర్తన రకరకాలుగా ఉంటుంది. అక్కడ ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కూల్ గా గేమ్ ఆడటం కుదరదు. బిగ్ బాస్ పెట్టే గేమ్స్, టాస్క్స్ ఇంటి సంభ్యుల మధ్య చిచ్చుపెట్టేలా ఉంటాయి. మనం ఎంత కంట్రోల్ గా ఉన్నా నోరు జారడమో అతిగా ప్రవర్తించడమో జరిగిపోతుంది. కారణం ఏదైనా కానీ.. తప్పు చేసినవారిని, హద్దులు దాటిన వారిన శిక్షించాలి. మరలా ఆ తప్పు చేయకుండా హెచ్చరించాలి. అలాగే ఒక గొడవ జరిగినప్పుడు ఎవరిది తప్పు అనేది హోస్ట్ సరిగా అంచనా వేయాలి. హోస్ట్ అభిప్రాయం ఆడియన్స్ అభిప్రాయానికి దగ్గరగా ఉంటే విమర్శలు రావు.

    ఈ వారం పృథ్వి-గౌతమ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పృథ్వి వాడు వీడు అంటూ మీదకు రావడంతో గౌతమ్ నోరు జారాడు. ఈ వివాదం పై నాగార్జున మాట్లాడాడు. ఇద్దరికీ క్లాస్ పీకాడు. అయితే గౌతమ్ దే తప్పు అన్నట్లు తేల్చాడు. నిఖిల్, పృథ్వి, ప్రేరణ, యష్మి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. నామినేషన్స్ లో కూడా ఇదే చేస్తున్నారు. పాయింట్స్ లేకపోయినా నామినేట్ చేస్తున్నారు, అది నాకు నచ్చడం లేదని నాగార్జునతో గౌతమ్ అన్నాడు.

    గ్రూప్ గేమ్ ఆడటం తప్పా. వారు మొదటి నుండి ఒక క్లాన్ గా ఉన్నారు. అది వాళ్ళ స్ట్రాటజీ అని నాగార్జున కన్నడ బ్యాచ్ ని వెనకేసుకుని వచ్చాడు. ఈ సీజన్ తో పాటు గత సీజన్లో కూడా గ్రూప్ గేమ్ ఆడటం తప్పని నాగార్జున పలు సందర్భాల్లో అన్నారు. గౌతమ్ అదే అంటే అతన్ని తప్పుబట్టారు. నాగార్జున అసలు ఎపిసోడ్స్ చూడటం లేదు. బిగ్ బాస్ మేకర్స్ ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అవుతున్నాడంటూ ట్రోల్ చేస్తున్నారు.

    శనివారం ఎపిసోడ్లో గౌతమ్ పట్ల నాగార్జున వ్యవహరించిన తీరు నచ్చని ఫ్యాన్స్ నాగార్జున పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నాగార్జున గౌతమ్ ని తిట్టినప్పటికీ అతడికే మేలు జరిగిందనే వాదన వినిపిస్తోంది. ఆడియన్స్ లో గౌతమ్ కి సింపతీ పెరిగింది. గౌతమ్ విషయంలో నాగార్జునది రాంగ్ జడ్జిమెంట్ అంటున్నారు. కాగా మరో మూడు వారాల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముగియనుంది. ఈ వారం యష్మి ఎలిమినేట్ కానుందట.