Rajamouli: దర్శకధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి…ఈయన ఏ సినిమా చేసినా కూడా అందులో ఎంతో కొంత వైవిధ్యం అయితే ఉంటుంది. అందుకే ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఆయన పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేయడానికి భారీ కసరత్తులను చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మీద దాదాపు రెండు సంవత్సరాలుగా కుస్తీ పడుతున్న ఆయన ఎట్టకేలకు ఫిబ్రవరి నుంచి ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని పాన్ వరల్డ్ కి పరిచయం చేస్తున్న ఘనత కూడా రాజమౌళికే దక్కుతుంది. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం అయితే చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఎప్పుడైతే బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి ఫ్యాన్ ఇండియాలో తన హవాని కొనసాగిస్తూ ముందుకు దూసుకెల్లడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్పును కూడా ఏర్పాటు చేసుకున్నాడు మరి ఇక్కడి వరకు బాగానే ఉంది.
కానీ రాజమౌళి చేసిన ఈ పని వల్ల తెలుగు సినిమా స్థాయి అయితే పెరిగింది. కానీ చిన్న నిర్మాతలకు, చిన్న సినిమాలకు భారీగా కష్టాలైతే వచ్చి పడ్డాయనే చెప్పాలి. ఇక ఈయన సినిమా చూసినా ప్రేక్షకుడు కూడా ప్రతి సినిమా బాహుబలి రేంజ్ లోనే ఉండాలి అన్నట్టుగా ఊహించుకొని థియేటర్ కి వస్తున్నారు.
ఇలాంటి సందర్భంలో చిన్న కాన్సెప్ట్ లను చూడడానికి గాని, చిన్న సినిమాలను పట్టించుకోవడానికి గాని ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దానివల్ల ప్రొడ్యూసర్స్ కొంతవరకు నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక అన్ని సినిమాలు బాహుబలి రేంజ్ లో తీయాలి అంటే కుదరదు. కాబట్టి కొన్ని సినిమాలను చిన్న సినిమాలుగా చిత్రీకరించి చిన్న నిర్మాతలు, దర్శకులు, హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్న క్రమంలో రాజమౌళి రూపంలో వాళ్లకు పెను దెబ్బ అయితే తగిలిందనే చెప్పాలి.
మరి మంచి కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలని ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పటికి అవి కూడా పెద్దగా థియేటర్లో సందడి అయితే చేయలేకపోతున్నాయి. ఇక ఓటిటి లోనే వాటి హవాని చూపించి అంతో ఇంతో ప్రాఫిట్స్ ను అయితే సంపాదించుకోగలుగుతున్నాయి…