RK Kotha Paluku: ఎప్పటి మాదిరిగానే వేమూరి రాధాకృష్ణ ఈరోజు కూడా వైసిపి మీద రెచ్చిపోయారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు. జగన్ మీద.. ఆయన అనుచరులు చేస్తున్న వ్యవహారం మీద టన్నులకొద్ది మట్టి పోశారు. ఇదేమీ ఆశ్చర్యం కాకపోయినప్పటికీ.. ఈ ఆదివారం కొత్త పలుకులో ఆయన కాస్త డోస్ పెంచారు.
వైసిపి నాయకులకు.. జగన్మోహన్ రెడ్డికి సంస్కారం ఉండాలని హితబోధ చేశారు. వారందరినీ కూడా సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ తో ఉతకాలని సూచించారు. “జగన్ ఆర్థిక నేరగాడు.. కాబట్టి ఆయనను కలవడానికి ఎవరూ ఒప్పుకోలేదు. చంద్రబాబు గొప్పవాడు కాబట్టి బిల్ గేట్స్ ఆంధ్ర ప్రదేశ్ ఎక్కడుంది అంటూ వచ్చాడు. బిల్ గేట్స్ కు కొన్ని బలహీనతలు ఉన్నాయి. అందువల్లే అతడు ఎఫ్ స్టీన్ ఫైల్స్ లో దొరికిపోయాడు. జగన్ రెడ్డికి సంపద పోగేసుకోవాలనే బలహీనత ఉంది. అందువల్లే ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విచారణకు కూడా హాజరవుతున్నారు. బలహీనతలను అధిగమించలేకపోవడం వారి బలహీనత” ఇదిగో ఇలా రాసుకుంటూ పోయారు రాధాకృష్ణ.
చంద్రబాబు ప్రస్తావన వస్తే రాధాకృష్ణ ఏమాత్రం ఆగడు . డైనమైట్ లాగా దూసుకుపోతుంటాడు. ఈ ఆదివారం కొత్త పలుకులో కూడా అలానే రెచ్చిపోయాడు. కాకపోతే.. ఇంతటి నీతి వాక్యాలు.. ఇంతటి హితబోధ చేసిన ఆయన.. బిల్ గేట్స్ ను ఎందుకు సర్ఫ్ ఎక్సెల్ వేసి ఉతకలేకపోయారు.. ఎందుకు నీతి వాక్యాలు చెప్పలేకపోయారు.. జగన్ ఆర్థిక నేరగాడు అయినప్పుడు.. బిల్ గేట్స్ మరో తరహా నేరగాడే కదా. చివరికి తనకు ఉన్న సుఖ వ్యాధిని దాచిపెట్టి.. భార్యకు ప్రమాదకరమైన యాంటీబయాటిక్స్ వేయాలని ప్రయత్నించిన వాడే కదా.. అటువంటి వ్యక్తి లో ఉన్న దరిద్రపుగొట్టు ఆలోచన బలహీనత ఎలా అవుతుంది? పైగా అతడు చేసింది మామూలు దారుణం కాదు కదా.. బిల్ గేట్స్ కు సంబంధించిన అనేక ఫోటోలు.. వీడియోలు బయటికి వచ్చాయి.. వాటిని సమర్థించుకోలేక.. చేసిన పనికిమాలిన పనికి బిల్ గేట్స్ ఇప్పటికీ అమెరికాలో తలెత్తుకోలేకపోతున్నాడు. అలాంటి వ్యక్తి సంజీవని పథకానికి తోడుగా నిలిచినంత మాత్రాన గొప్పగా చెప్పుకోవాలా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుకు ఆహ్వానం ఉన్నప్పటికీ బిల్గేట్స్ వెళ్లలేదని మీరే రాసినప్పుడు.. ఆ వ్యక్తిని ఏపీ ప్రభుత్వం ఎందుకు ఆహ్వానించాలి? ఎందుకు ఆయనకు ఎర్ర తివాచీ పరచాలి.. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసినప్పుడు బిల్ గేట్స్ గురించి చాలామంది గొప్పగా చెప్పుకున్నారు. ఎందుకంటే ఆయన చీకటి కోణం అప్పటికి చాలామందికి తెలియదు కాబట్టి.. జేజేలు పలికారు. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడిగా కనిపించినప్పుడు.. మిగతా వారికి బిల్ గేట్స్ లైంగిక నేరస్థుడిగా ఎందుకు కనిపించకూడదు.. అంటే చంద్రబాబు పిలిచాడు కాబట్టి బిల్ గేట్స్ ను గొప్పవాడు అని చెప్పాలా.. ఆయన ఏపీకి అండగా ఉంటున్నాడని సంబరపడాలా.. పాపపు సొమ్ము ఎప్పటికీ పాపమైనదే.. నెత్తుటికూడు ఎప్పటికీ రక్తసిక్తమైనదే. పాపం దీన్ని కవర్ చేయడానికి రాధాకృష్ణ ఆపసోపాలు పడ్డాడు. నిప్పులు చిమ్మే విధంగా.. మిస్సైల్స్ మాదిరిగా ఉండే రాధాకృష్ణ అక్షరాలు చివరికి ఇలా అయిపోయాయి. ఒక పని చేయండి రాధాకృష్ణ.. అదే సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ తో ఓసారి బిల్ గేట్స్ ను ఉతకండి. ఎలాగూ చరమాంకంలో ఉన్నాడు కాబట్టి కాస్తో కూస్తో బుద్ధి తెచ్చుకుంటాడు.