https://oktelugu.com/

Vasireddy Padma : దూకుడు పెంచిన వాసిరెడ్డి పద్మ.. వైసీపీకి చుక్కలే!

వైసీపీ మహిళా నేతల్లో వాసిరెడ్డి పద్మ ఒకరు.కానీ ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు.కూటమి పార్టీల్లో ఏదో ఒక దానిలో చేరనున్నారు. కొద్ది రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 2, 2024 / 05:25 PM IST

    Vasireddy Padma

    Follow us on

    Vasireddy Padma : నిన్నటి వరకు ఆమె వైసీపీ ఫైర్ బ్రాండ్. పార్టీ వాయిస్ ను బలంగా వినిపించేవారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినా… అక్కడ రాని గుర్తింపు మాత్రం వైసీపీలో లభించింది. జగన్ ఎనలేని స్వేచ్ఛ ఇచ్చారు. ఏ మహిళా నేతకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఆ హోదాతో ఆమె అప్పటి విపక్ష నేత చంద్రబాబుకు సైతం నోటీసులు పంపారు. ఆయనతోనే నేరుగా వాగ్వాదం దిగిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి మహిళా నేత ఇప్పుడు వైసీపీకి ఎదురు తిరిగారు. ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చుంటుంది. ఆమె వాసిరెడ్డి పద్మ. ఎన్నికలకు ముందు టికెట్ ఆశించి ఏకంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి గుడ్ బై చెప్పారు. అయినా సరే జగన్ కరుణించలేదు. దీంతో వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆమె.. తాజాగా గుడ్ బై చెప్పారు. వెళుతూ వెళుతూ జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఈరోజు వివాదాస్పద మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ రేప్ కేస్ బాధితురాలు పేరు బయటపెట్టారంటూ విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో వైసిపి పై ఆమె పోరాటం ప్రారంభించినట్లు అయింది. కచ్చితంగా కూటమి పార్టీల్లో సేఫ్ జోన్ కోసమే ఆమె ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

    * జనసేనలో చేరతారని ప్రచారం
    వైసీపీకి గుడ్ బై చెప్పినప్పుడు వాసిరెడ్డి పద్మ జనసేనలో చేరతారని ప్రచారం సాగింది. పూర్వాశ్రమంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేయడంతో పవన్ కళ్యాణ్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆమె జనసేనలో చేరుతారని ప్రచారం సాగింది. అయితే తాజాగా ఆమె హాట్ కామెంట్స్ చేశారు. వారం పది రోజుల్లో తనరాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. టిడిపి ఎంపి కేశినేని చిన్ని తనకు ఆప్తులని తెలిపారు. తద్వారా తాను టిడిపిలో చేరుతున్నట్లు సంకేతాలు పంపారు.వాసిరెడ్డి పద్మది ఉమ్మడి కృష్ణ జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గం. ఈ ఎన్నికల్లో తనకు కానీ.. తన భర్తకు కానీ జగ్గయ్యపేట నియోజకవర్గ టికెట్ కేటాయించాలని ఆమె కోరారు. కానీ జగన్ అంగీకరించలేదు. దీంతో ఆమె పార్టీకి దూరంగా ఉండిపోయారు. అలాగని పార్టీకి రాజీనామా చేయలేదు. అయితేఅధికార ప్రతినిధి హోదాలో వైసీపీకి సుదీర్ఘకాలం సేవలు అందించారు.తన సేవలకు తగ్గ పదవి ఇవ్వలేదన్న బాధ వాసిరెడ్డి పద్మలో ఉండేది.ప్రత్యక్ష రాజకీయాల ద్వారా చట్టసభల్లో అడుగుపెట్టాలని భావిస్తున్నారు వాసిరెడ్డి పద్మ. వైసీపీలో ఉండగా అది జరిగే పని కాదని భావించి ఆ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనతో కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలను సర్దుబాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె టిడిపిలో చేరేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం.