Vallabhaneni Vamsi: అధికార పార్టీలో ఉండేటప్పుడు హాయిగా ఉండవచ్చు. కానీ విపక్షానికి వస్తే మాత్రం చుక్కలు చూడాల్సిందే. అయితే ఇది అందరి నేతలకు వర్తించదు. కేవలం నోటి దూలతో వ్యవహరించే నాయకులకు మాత్రం ఎప్పుడు ఇబ్బందికరమే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వంటి నాయకులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వారు తమ రాజకీయానికే నమ్ముకున్నారు. కానీ కొంతమంది నాయకులు తమకంటే.. పార్టీతో పాటు అధినేతను నమ్ముకున్నారు. అటువంటివారు క్షణం క్షణం భయపడాల్సిందే. ఇటువంటి వారిలో వల్లభనేని వంశీ మోహన్, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారు ఉంటారు. వారు తమ బలం కంటే, తమకంటే, తమ అధినేత జగన్మోహన్ రెడ్డి పై నమ్మకం పెట్టుకున్నారు. ఆయనను ఆరాధించేవారు. ఆయన లేనిదే తమకు రాజకీయ జీవితం లేదని భావించేవారు.
* ఫిరాయింపు తర్వాత..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ లబ్ధి పొందితే ఒక రకం. ఈ విషయంలో కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారికి ఒక రకమైన మినహాయింపు ఉంటుంది. కానీ వల్లభనేని వంశీకి అందులో ఎంత మాత్రం మినహాయింపు ఉండదు. 2014లో ఆయనకు టిక్కెట్ ఇచ్చింది చంద్రబాబు. సిఫారసు చేసిన వారిని పక్కన పెడితే.. టికెట్ ఇచ్చింది మాత్రం బాబు. ఐదేళ్లపాటు అధికారాన్ని అనుభవించారు వంశీ. పోనీ అప్పుడైనా చంద్రబాబును వ్యతిరేకించారా అంటే అదీ లేదు. చంద్రబాబు ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగిడారు. ఆయనతో మూడోసారి బి ఫారం అందుకున్నారు. 2019లో పోటీ చేసి గన్నవరం నుంచి గెలిచారు. ఎవరి చేతితో బీఫారం తీసుకున్నారు అదే చంద్రబాబును విమర్శించడం ప్రారంభించారు. పోనీ అక్కడితో ఊరుకున్నారా అంటే ఆయన కుమారుడు లోకేష్ ను తూలనాడారు. చంద్రబాబును అమ్మనా బూతులు తిట్టారు. ఆయన సతీమణిని సైతం నిండు శాసనసభలో అవమానకరంగా మాట్లాడేలా అవకాశం ఇచ్చారు వంశీ. కానీ ఓడిపోయాక భువనక్క.. ఆవిడ విషయంలో తాను అన్యాయం చేయలేదని మొసలి కన్నీరు కార్చారు.
* కొద్ది రోజుల కిందట మరో కేసు..
వైసిపి హయాంలో ఎంత దర్పం ప్రదర్శించారో.. అంతకుమించి అన్నట్టు కూటమి అధికారంలోకి వచ్చాక జైలు జీవితం అనుభవించారు వల్లభనేని వంశీ మోహన్. జైలుకు వెళ్లే సమయంలో అందంగా కనిపించిన వంశీ.. జైలు నుంచి బయటకు వచ్చే క్రమంలో అంద విహీనంగా కనిపించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ కంటే అందగాడుగా అభివర్ణించారు జగన్మోహన్ రెడ్డి. వల్లభనేని వంశీ మోహన్ అందం తట్టుకోలేక చంద్రబాబు ఆయనపై రివేంజ్ తీర్చుకుంటున్నారంటూ జగన్మోహన్ రెడ్డి వర్ణించారు. ఇలా వర్ణించిన క్రమంలో ఐదు నెలల తరువాత కళా విహీనంగా కనిపించారు వంశీ. కనీసం గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. ఎంతలా అంటే చివరికి తనకు తాను మేధావిగా భావించే పేర్ని నాని లాంటి వారు గుర్తు పట్టని విధంగా.. అయితే 150 రోజులకు పైగా జైలు జీవితం అనుభవించారు వల్లభనేని వంశీ మోహన్. అయితే కొద్ది రోజుల కిందట ఆయనపై మరో కేసు నమోదయింది. దీంతో వంశీ అరెస్టు తప్పదని తేలిపోయింది. ఈ పరిస్థితిని గమనించిన వంశీ మోహన్ పరారీ అయ్యారు. మరోసారి అరెస్ట్ అయితే తన పరిస్థితి ఊహించుకొని ముందుగానే జాగ్రత్తపడ్డారు. అయితే కూటమి వైసీపీలా కాదు. ఎందుకంటే అరెస్ట్ అయిన ప్రతి నేతకు ఒక అవకాశం ఇచ్చింది. చట్ట పరంగా మినహాయింపు తెచ్చుకునేలా చేసింది. ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో కూడా అదే మాదిరిగా చేసింది. కోర్టులో ఉపశమనం దక్కేసరికి బయటకు వచ్చారు వంశీ. ఎంచక్కా నిశ్చింతగా పండుగ పూట రిలాక్స్ అయ్యారు వంశీ. అయితే అది ఆయన స్వేచ్ఛ కాదు. ఇంకొకరి దయాదాక్షిణ్యం అన్న విషయాన్ని అటువంటి నేత గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే వల్లభనేని వంశీ మోహన్ అనే నేత గుణపాఠం