https://oktelugu.com/

Visakha Dairy : విశాఖ డెయిరీపై ఆ టీడీపీ నేత కన్ను.. సడన్ గా ఇప్పుడు బిజెపి!

ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. కూటమి పార్టీలో చేరికల విషయంలో సమన్వయం లోపిస్తోంది. టిడిపిలో చేరాల్సిన నేత విషయంలో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. అదే నేత బిజెపిలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Written By:
  • Dharma
  • , Updated On : December 29, 2024 / 10:13 AM IST
    Follow us on

    Visakha Dairy : ఉత్తరాంధ్ర రాజకీయాల్లో విశాఖ డెయిరీ అంశం కాక రేపుతోంది. చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ తో పాటు పదిమంది డైరెక్టర్లు రాజీనామాతో కొత్త మలుపు తిరిగింది. టిడిపిలో చేరుతామని భావించిన ఆనంద్ కుమార్ కు అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. హై కమాండ్ వెనక్కి తగ్గినట్లు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న జిల్లాకు చెందిన ఓ నేత విశాఖ డెయిరీ చైర్మన్ పోస్టులో తన కుమారుడిని చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉండే సదరు యువనేతను చైర్మన్ పోస్ట్ అందించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

    * సుదీర్ఘ ప్రస్థానం
    విశాఖ డెయిరీది సుదీర్ఘ నేపథ్యం. 1973లో దీని ప్రస్థానం ప్రారంభం అయింది. అడారి తులసిరావు దీనిని ఏర్పాటు చేశారు. ఎంతో ఉన్నత స్థితికి చేర్చారు. 1100 కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతోంది. అందుకే దీనిని సొసైటీ నుంచి కంపెనీగా మార్చారు. మరణించే వరకు తులసి రావు చైర్మన్ గా కొనసాగుతూ వచ్చారు. టిడిపి ఆవిర్భావం నుంచి ఆయన అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. డెయిరీ చైర్మన్ పోస్ట్ తప్ప మరొకటి కోరుకోలేదు. ఆపై ఉత్తరాంధ్రలో టిడిపి బలపడేందుకు కృషి చేశారు. తెలుగుదేశం పార్టీతో పాటు రైతుల్లోనూ మంచి పట్టు సాధించారు. ఆయన హయాంలో రైతులకు మెరుగైన సేవలు అందేవి. నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా వినియోగదారుల నమ్మకాన్ని కూడా సాధించారు. అందుకే ఎప్పుడూ ఎన్నికలు జరిగినా తులసిరావు ప్యానల్ ఘనవిజయం సాధించేది. ఆయన మరణానంతరం ఆనంద్ కుమార్ చైర్మన్ అయ్యారు.

    * టిడిపి శ్రేణుల బాధ అదే..
    అయితే తులసి రావు ఉన్నప్పుడే చంద్రబాబు ఆనందకుమార్ కు పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. దీంతో ఆనంద్ కుమార్ వైసీపీలో చేరారు. విశాఖ డెయిరీపై ఎగిరిన టిడిపి జెండాను తొలగించారు. అందుకే టిడిపి శ్రేణులు ఆయనపై ఆగ్రహంతో ఉన్నాయి. గత ఏడు నెలలుగా చెక్ చెప్పాలని భావిస్తున్నాయి. కానీ అనూహ్యంగా ఆనంద్ కుమార్ బిజెపిలో చేరారు. అయితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆ నేత విశాఖ డెయిరీ చైర్మన్ పోస్టులో తన కుమారుడిని చూసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకు టిడిపి హై కమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే శరణు కోరుతూ ఆనంద్ కుమార్ బిజెపిలో చేరడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.