Chandrababu Arrest : చంద్రబాబు కోసం కుటుంబం యావత్తు రంగంలోకి దిగింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. దీంతో కుటుంబం తీవ్ర మనోవేదన గురవుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనకు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆయన హౌస్ అరెస్ట్ కు సంబంధించి పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ తరుణంలో చంద్రబాబు లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంతో పాటు తదుపరి విచారణపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ తరుణంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు రాజమండ్రిలోని సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును పరామర్శించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి చంద్రబాబును పరామర్శించారు. కొద్దిసేపు చర్చించారు. అనంతరం జైలు బయటకు వచ్చిన భార్య భువనేశ్వరి భావోద్వేగానికి గురై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
చంద్రబాబు భద్రతపై ఆయన భార్య భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. జైలు నుంచి త్వరగా బయటకు రావాలని ఆకాంక్షించారు. ప్రజలే తనకు ముఖ్యమని ఆయన ఎప్పుడూ అనేవారని గుర్తు చేశారు. ప్రజల హక్కుల కోసమే తాను పోరాటం చేస్తున్నానని.. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను పోరాడుతానని చంద్రబాబు తమతో చెప్పారని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. ఎవరూ భయపడవద్దని.. మా కుటుంబం ప్రజల కోసమే పోరాడుతుందని… క్యాడర్ ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సా పడవద్దని భువనేశ్వరి పిలుపునిచ్చారు. దేశంలో ఏపీని అగ్రగామిగా నిలపడమే చంద్రబాబు ముఖ్య ఉద్దేశ్యమని భువనేశ్వరి చెప్పుకొచ్చారు.
అయితే ఈ క్రమంలో భువనేశ్వరి కన్నీటి పర్యంతం కావడం టిడిపి శ్రేణులను ఆందోళన గురిచేసింది. చంద్రబాబు నిర్మించిన భవనంలోనే ఆయనను తీసుకెళ్లి పెట్టారంటూ భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కోసం నా ఆత్మను అక్కడే వదిలేసి వచ్చా అని ఆమె ప్రకటించారు. చంద్రబాబు జైల్లో చన్నీళ్ళతో స్నానం చేయాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ పరిస్థితులను తలుచుకొని భువనేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం భువనేశ్వరి కామెంట్స్ ను తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. నేటిజనులను సైతం ఆలోచింపచేస్తున్నాయి.