AP Election Survey 2024: ఏపీపై రెండు సంచలన సర్వేలు : గెలుపు ఎవరిదంటే?

ఎలక్ట్రోరల్ ఎక్కువ సర్వేలో సైతం వైసీపీ దే విజయం అని తేలింది. ఆ పార్టీకి 115 నుంచి 120 స్థానాలు దక్కే ఛాన్స్ ఉన్నట్లు సర్వే తేల్చింది. టిడిపి కూటమి 55 నుంచి 60 స్థానాలను దక్కించుకోనుందని స్పష్టమైంది.

Written By: Dharma, Updated On : May 8, 2024 10:47 am

AP Election Survey 2024

Follow us on

AP Election Survey 2024: ఎన్నికలకు పట్టుమని నాలుగు రోజుల వ్యవధి కూడా లేదు. ఈనెల 13న పోలింగ్ జరగనుంది. 11తో ప్రచారం ముగియనుంది. ఈ సమయంలో ఏపీలో సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా రెండు సర్వేలుబయటకు వచ్చాయి. ఎలక్ట్రోలర్ ఎకో సర్వే తో పాటు పాలిమెట్రిక్స్ సర్వే పేరిట.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నివేదికలు ఇవి అంటూ సదరు సంస్థ ధ్రువీకరణతో ఉన్న పత్రాలు సైతం దర్శనమిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే చేపట్టినట్లు వివరంగా చెప్పడం విశేషం.

ముఖ్యంగా పాలిమెట్రిక్స్ సర్వేలో వైసీపీ దే విజయం అని స్పష్టం అయ్యింది. ఆ పార్టీ 113 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే తేల్చి చెప్పింది. టిడిపి కూటమికి 39 స్థానాలు దక్కుతాయని.. మరో 23 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని ఈ సర్వే తేల్చింది. వైసిపి 51.50 శాతం ఓట్లు సాధిస్తుందని, టిడిపి కూటమికి 43% ఓట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి ఒకటి, ఇతరులకు 4.5% ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చి చెప్పడం విశేషం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వైసీపీ హవా నడుస్తుందని.. ముఖ్యంగా రాయలసీమలో ఏకపక్ష విజయం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే తేల్చి చెప్పింది.

ఎలక్ట్రోరల్ ఎక్కువ సర్వేలో సైతం వైసీపీ దే విజయం అని తేలింది. ఆ పార్టీకి 115 నుంచి 120 స్థానాలు దక్కే ఛాన్స్ ఉన్నట్లు సర్వే తేల్చింది. టిడిపి కూటమి 55 నుంచి 60 స్థానాలను దక్కించుకోనుందని స్పష్టమైంది. 49.50 శాతం ఓట్లను వైసిపి దక్కించుకుంటుందని.. టిడిపి కూటమి 43.5% ఓట్లకు పరిమితం అవుతుందని.. కాంగ్రెస్ పార్టీ ఒక శాతం.. ఇతరులు 3.5% ఓట్లు దక్కించుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రభుత్వంపై ఎటువంటి వ్యతిరేకత లేదని ఈ రెండు సర్వేలు తేల్చి చెప్పడం విశేషం. ఈ సర్వేలు వైసీపీకి అనుకూల ఫలితాలు ఇవ్వడంతో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నాయి. ఇప్పటికే మెజారిటీ సర్వేలు ఎన్డీఏ కూటమికి జై కొట్టిన తరుణంలో.. ఇప్పుడు వైసీపీకి అనుకూల సర్వేలు రావడంతో ఆ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఎలాగైనా విజయం సాధిస్తాం అన్న నమ్మకంతో ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.