Prabhas-Sukumar: ప్రభాస్ సుకుమార్ కాంబో కోసం అక్కడి జనాలు విపరీతం గా ఎదురు చూస్తున్నారా..?

తెలుగులో మొదలైన ఈయన ప్రస్థానం ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ కి విస్తరించింది. నిజానికి ఒక తెలుగు హీరో ఇలా తన స్టార్ డమ్ ను విస్తరించుకోవడం అనేది ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : May 8, 2024 10:39 am

people there eagerly waiting for Prabhas Sukumar combo

Follow us on

Prabhas-Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో ప్రభాస్ ఒకరు..ఇక ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటి నుంచి ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నాడనే చెప్పాలి. ఇక తెలుగులో మొదలైన ఈయన ప్రస్థానం ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ కి విస్తరించింది. నిజానికి ఒక తెలుగు హీరో ఇలా తన స్టార్ డమ్ ను విస్తరించుకోవడం అనేది ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ జనాలు సోషల్ మీడియాలో ఇప్పుడు ఆసక్తికరమైన కామెంట్స్ అయితే చేస్తున్నారు. అదేంటి అంటే పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ స్టార్ గా ముందుకు సాగుతున్న ప్రభాస్ హీరోగా, ఇక పుష్ప సినిమాతో డైరెక్టర్ గా తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్న సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుంది. ఆ సినిమా కోసం మేము చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నామంటూ బాలీవుడ్ జనాలు కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి ప్రభాస్, సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే బాగుంటుందని మనందరం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. ఇక ఇప్పుడు బాలీవుడ్ జనాలు కూడా ఆ కాంబినేషన్ కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు. అంటే సుకుమార్ మేకింగ్ గాని, ఆయన కథ మీద తీసుకునే కేరింగ్ గాని ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అదే ఆయన మాస్ యాక్షన్ స్టోరీ తో ప్రభాస్ ని కనుక ఆయన సినిమాల్లో చూపిస్తే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక నిజానికి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా గురించి చాలా మంది ఎదురుచూస్తున్నారు.

కానీ ఇప్పుడు బాలీవుడ్ జనాలకు కూడా అలా అనిపించిందంటే వీళ్ళు బాలీవుడ్ జనాల్లో కూడా వాళ్ల ఇంపాక్ట్ ను క్రియేట్ చేసుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రభాస్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్ లో సినిమా ఎప్పుడు వస్తుంది అనేది తెలియాలంటే మరి కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే…