https://oktelugu.com/

Jabardasth Rohini: హైపర్ ఆది మోసం బయటపెట్టిన జబర్దస్త్ కమెడియన్ రోహిణి… నా కడుపుకొట్టాడంటూ కీలక ఆరోపణలు!

రోహిణి రూపం, ఆమె కామెడీ టైమింగ్ నవ్వులు పూయిస్తుంది. సక్సెస్ఫుల్ జబర్దస్త్ కమెడియన్స్ లో ఒకరిగా రోహిణి గుర్తింపు తెచ్చుకుంది.

Written By: , Updated On : May 8, 2024 / 10:50 AM IST
Jabardasth Comedian Rohini sensational comments on hyper aadi

Jabardasth Comedian Rohini sensational comments on hyper aadi

Follow us on

Jabardasth Rohini: జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హైపర్ ఆది మోసం చేశాడని ఆమె చెప్పడం చర్చకు దారి తీసింది. హైపర్ ఆది తన కడుపు కొట్టాడన్న రోహిణి… నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అంటుంది. ఈ పంచాయితీ ఏమిటో చూద్దాం… రోహిణి సీరియల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమె పలు సీరియల్స్ లో కీలక పాత్రలు చేసింది. బ్రేక్ రాకపోవడంతో జబర్దస్త్ వైపు అడుగులు వేసింది. చాలా కాలంగా ఆమె జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తున్నారు.

రోహిణి రూపం, ఆమె కామెడీ టైమింగ్ నవ్వులు పూయిస్తుంది. సక్సెస్ఫుల్ జబర్దస్త్ కమెడియన్స్ లో ఒకరిగా రోహిణి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే రష్మీ గౌతమ్ యాంకర్ గా ఉన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం స్కిట్స్ చేస్తుంది. రోహిణి నటనకు ఫిదా అవుతున్న దర్శక నిర్మాతలు సినిమాల్లో, వెబ్ సిరీస్లలో అవకాశాలు ఇస్తున్నారు. ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ వేణు తెరకెక్కించిన బలగం మూవీ రోహిణి నటించిన సంగతి తెలిసిందే.

వేణు సైతం ఒక రోల్ చేయగా ఆయన భార్య పాత్రలో రోహిణి నటించి మెప్పించింది. బలగం మూవీలో రోహిణి కామెడీ అలరిస్తుంది. రోహిణికి ఫేమ్ తెచ్చిన మరొక ప్రాజెక్ట్ సేవ్ ది టైగర్స్. అభినవ్ గోమటం, ప్రియదర్శి, చైతన్య ప్రధాన పాత్రలు చేశారు. అభినవ్ ఇంట్లో పనిమనిషి పాత్రలో రోహిణి నాన్ స్టాప్ గా నవ్విస్తుంది.

సిల్వర్ స్క్రీన్ మీద కూడా రోహిణి రాణించే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా హైపర్ ఆది మీద ఆరోపణలు చేసింది రోహిణి. హైపర్ ఆది నా కడుపు కొట్టాడు. నా కెరీర్ నాశనం చేశాడు. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అన్నది. అయితే ఇదంతా స్కిట్ లో భాగమే. కామెడీ స్కిట్ లో రోహిణి బుగ్గలు, ఐస్ క్రీమ్స్ అమ్ముకునే పాత్ర చేసింది రోహిణి. హైపర్ ఆది ఆమె వ్యాపారాన్ని దెబ్బ తీస్తాడు. ఈ క్రమంలో హైపర్ ఆది మీద ఆరోపణలు చేస్తుంది రోహిణి. ఈ కామెడీ స్కిట్ బాగా ఎంటర్టైన్ చేసింది..