TV9 Rajinikanth: TV9 రజినీకాంత్ మాస్ ర్యాగింగ్ ఇదీ

ఏపీ రాజకీయాల్లో పొత్తులకు సంబంధించి టీవీ9 లో శుక్రవారం ప్రైమ్ టైం బులిటెన్ లో రజనీకాంత్ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. "ఏపీ రాజకీయాలకు సంబంధించి ఇంకా పొత్తు కుదరలేదు.

Written By: Suresh, Updated On : March 9, 2024 3:02 pm

TV9 Rajinikanth

Follow us on

TV9 Rajinikanth: ఏపీలో ఎన్నికల వాతావరణం పీక్ స్టేజ్ కి వెళ్ళింది. వైసిపి ఇప్పటికే పార్లమెంట్ స్థానాలకు దాదాపుగా అభ్యర్థులను ప్రకటించింది. ఏ క్షణంలోనైనా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. అటు టిడిపి, జనసేన కూటమి కూడా మొదటి విడత అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బిజెపి తమతో కలుస్తుంది కాబట్టి.. రెండవ విడత సీట్ల కేటాయింపును టిడిపి, జనసేన హోల్డ్ లో పెట్టాయి. ఆ మూడు పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి శనివారం ఒక కీలక అడుగుపడుతుందని ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోంది. ఇక ఈ పొత్తుకు సంబంధించి అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. నిన్నంతా అక్కడే పడిగాపులు కాశారు. టిడిపి అనుకూల మీడియా ఇదిగో, అదిగో పొత్తు పొడిచింది. చంద్రబాబు చెప్పినట్టే బిజెపి విన్నది. అనే కోణంలో వార్తలు ప్రసారం చేసింది. కానీ అక్కడ వాస్తవ పరిస్థితి వేరు.

ఇక ఏపీ రాజకీయాల్లో పొత్తులకు సంబంధించి టీవీ9 లో శుక్రవారం ప్రైమ్ టైం బులిటెన్ లో రజనీకాంత్ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. “ఏపీ రాజకీయాలకు సంబంధించి ఇంకా పొత్తు కుదరలేదు. ఆ పొత్తు కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పడిగాపులు కాస్తున్నారు. అసలే ఈరోజు శివరాత్రి. చాలామంది శివుడి కరుణాకటాక్షాల కోసం జాగారం ఉంటారు. అటు ఏపీ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సీట్ల కోసం రాజకీయ జాగారం చేస్తున్నారంటూ” ఆయన కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఒక వర్గం మీడియా ఈ విషయాలు మొత్తం చెప్పకుండా కేవలం టిడిపి అనుకూల కోణంలోనే వార్తలు ప్రసారం చేసింది.

టీవీ9 వార్తలు అలా కాకుండా అక్కడ ఉన్న పరిస్థితిని వెల్లడించింది. అంటే ఇక్కడ టీవీ9 సుద్ధ పూస అని మేము చెప్పడం లేదు. మేనేజ్మెంట్ ప్రయోజనాలకు అనుగుణంగా రజనీకాంత్ అక్కడ విషయాన్ని వెల్లడించారు. ఒకవేళ మేనేజ్మెంట్ అవసరాలు వేరే విధంగా ఉంటే వార్త కూడా వేరే విధంగా వచ్చేది. రజనీకాంత్ నోటివెంట కూడా అనుకూల పదాలు వచ్చేవి. సో ఇక్కడ మీడియా అనేది వర్గాలుగా విడిపోయిన తర్వాత, పార్టీలకు డప్పు కొట్టే స్థితికి జారిపోయిన తర్వాత.. వార్తలు అనేవి న్యూట్రల్ కోణంలో ఉండవు. ఇక రజనీకాంత్ మాట్లాడిన మాటల తాలూకూ సంబంధించిన వీడియోను వైసిపి సోషల్ మీడియా తెగ సర్కులేట్ చేస్తోంది. దీనిపై టిడిపి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది.