spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Tuni Missing Girl: తుని చిన్నారి అదృశ్యమై నెల.. పాపం తల్లితండ్రీ పరిస్థితి చూడండి

Tuni Missing Girl: తుని చిన్నారి అదృశ్యమై నెల.. పాపం తల్లితండ్రీ పరిస్థితి చూడండి

Tuni Missing Girl: * వీడని మిస్టరీ..
తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటితో నెల రోజులు గడుస్తోంది. కానీ ఇంతవరకు ఆమె ఆచూకీ దొరకలేదు. పోలీసులు చేయని ప్రయత్నం అంటూ లేదు. గత నెల ఆరున జ్ఞానేశ్వరి అదృశ్యమయింది. తన ఇంటి సమీపంలో పని నిమిత్తం బయటకు వెళ్లిన తండ్రిని వెతుక్కుంటూ వెళ్లిన చిన్నారి.. తరువాత కనిపించకుండా మానేసింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. స్థానికులు సైతం చిన్నారి కోసం వెతుకులాట ప్రారంభించారు. కానీ గంటలు, రోజులు, వారాలు దాటుతున్న జ్ఞానేశ్వరి ఆచూకీ లేదు. దీంతో ఎన్టీఆర్ ఎఫ్, ఎస్టిఆర్ఎఫ్, ప్రత్యేక పోలీస్ బలగాలు జల్లెడ పట్టాయి. చుట్టుపక్కల ఉన్న తోటలు, పొదలు, బావులు, రైల్వే ట్రాక్ పరిసరాలతో పాటు అనుమానాస్పద ప్రాంతాలన్నింటిని డ్రోన్ కెమెరాల సాయంతో.. రోజుల తరబడి క్షుణ్ణంగా గాలించారు. అయినా ఆచూకీ లేకుండా పోయింది. సిసి ఫుటేజీలను పరిశీలించి.. అన్వేషించినా ఆచూకీ లేదు.

తొలుత అనుమానాస్పద కేసుగా భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ కోణంలో కూడా విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులను సైతం విచారించి అంతర్గత విషయాలను తెలుసుకున్నారు. అయినా కేసు మిస్టరీ విడలేదు. మరోవైపు ఈ కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క కూడా అనారోగ్యంతో మృతి చెందింది. ఏదైనా అటవీ జంతువుల బారిన పడి ఉంటుంది అన్న అనుమానంతో పోలీసులు.. ఆ దిశగా కూడా విచారణ చేపట్టారు. కానీ అందులో కూడా ఎటువంటి పురోగతి లభించలేదు. దీంతో నెల రోజులు గడుస్తున్న చిన్నారి ఆచూకీ దొరకకపోవడం పోలీస్ శాఖకు ఒక సవాల్.

* తల్లిదండ్రులకు కడుపుకోత.
తమ కళ్ళముందు ఆడుకుంటూ తిరిగిన బిడ్డ నెలరోజులైనా ఇంటికి చేరకపోవడంతో ఆ తల్లిదండ్రుల కడుపుకోత వర్ణనాతీతం. కూతురిపై బెంగతో తల్లి కన్నీరు మున్నేరుగా వినిపిస్తోంది. అన్న పానీయాలు మానేసి అపస్మారక స్థితికి చేరుకొంటోంది. మరోవైపు గుండె నిండా బాధగా ఉన్నప్పటికీ ఎలాగైనా తన ప్రాణ సమానమైన బిడ్డను వెతికి పట్టుకోవాలని పట్టుదలతో తండ్రి ఉన్నారు. చిన్నారి ఫోటో, వివరాలతో కూడిన పోస్టర్లు బస్టాండ్ లతోపాటు రైల్వేస్టేషన్లో అతికించారు. ఏదోరోజు పాప ప్రాణాలతో తమకు చిక్కుతుందన్న ఆశ వారిలో ఉంది. అందుకే పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular