https://oktelugu.com/

Tirumala : శ్రీవారి హుండీకి కళ్ళు చెదిరే ఆదాయం.. 2024 లో ఎంత వచ్చిందో తెలుసా?*

తిరుమల శ్రీవారికి 2024లో భారీగా ఆదాయం సమకూరింది. భక్తుల ముడుపుల రూపంలో అధిక ఆదాయం వచ్చింది.

Written By:
  • Dharma
  • , Updated On : January 2, 2025 / 03:22 PM IST

    Tirumala srivari hundi income

    Follow us on

    Tirumala :  ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత గుర్తింపు పొందింది. నిత్యం లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. తమకు తోచిన ముడుపులు వేసుకుంటారు. నిత్యం భక్తుల రద్దీతో ఉండే తిరుమలకు ఆదాయం కూడా ఎక్కువే. 2024 లో తిరుమల శ్రీవారికి కాసుల వర్షం కురిసింది. గత ఏడాది శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. ఏకంగా 1365 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 99 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. 6.30 కోట్ల మంది అన్న ప్రసాదం స్వీకరించారు. 12.14 కోట్ల లడ్డు విక్రయాలు సాగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 2024లో టీటీడీకి ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు చెబుతున్నాయి.

    * ప్రతినెలా రూ.100 కోట్ల పై మాటే..
    ఏడాది మొత్తం ఆదాయం చూసుకుంటే.. ప్రతి నెల సగటున 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరినట్లే. అయితే గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. నెలకు సగటున 100 కోట్ల రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూటమి సర్కార్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా భక్తుల దర్శనాల విషయంలో సేవలను మరింత సరళతరం చేసింది. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుడు సంతృప్తిగా తిరిగి వెళ్లేలా చూడాలని నిర్ణయించింది.

    * టీటీడీ కీలక నిర్ణయాలు
    తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడిగా బీర్ నాయుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాలు, ఆస్తుల పరిరక్షణ కోసం సూచనలు ఇచ్చేందుకు నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది టీటీడీ. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టు ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు కూడా నిర్ణయించింది. టిటిడి కి వచ్చిన ఆదాయంతో దేశంలో ఇతర ప్రాంతాల్లో సైతం స్వామి వారి ఆలయాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆసుపత్రిని జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది టీటీడీ. ఇలా భక్తుల ద్వారా సమకూరుతున్న ఆదాయం తిరిగి ప్రజలకు సేవలందించేందుకు ప్రయత్నిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.