https://oktelugu.com/

భారత ఆర్థిక వ్యవస్థకు ‘మూడిం’ది..

కరోనా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఆర్థిక మూలాలను భారీగా దెబ్బతీస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్‌, జూన్ క్వార్టర్‌‌లో ఏకంగా మైనస్‌ 32.9 శాతానికి పడిపోయింది. తర్వాతి స్థానంలో మైనస్‌ 23.9 శాతంతో భారత్‌ ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆదాయం తగ్గింది.. ఖర్చు పెరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు బ్రేక్‌ పడింది. దీంతో ఇప్పుడు రాష్ట్రాలను అప్పులతోనే నడిపించాల్సి వస్తోంది.  మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 12, 2020 / 10:03 AM IST

    Indian economy

    Follow us on

    కరోనా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఆర్థిక మూలాలను భారీగా దెబ్బతీస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్‌, జూన్ క్వార్టర్‌‌లో ఏకంగా మైనస్‌ 32.9 శాతానికి పడిపోయింది. తర్వాతి స్థానంలో మైనస్‌ 23.9 శాతంతో భారత్‌ ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆదాయం తగ్గింది.. ఖర్చు పెరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు బ్రేక్‌ పడింది. దీంతో ఇప్పుడు రాష్ట్రాలను అప్పులతోనే నడిపించాల్సి వస్తోంది.  మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిలు విడుదల కావడం లేదు.

    Also Read: కాంగ్రెస్ ప్రక్షాళన.. రాహుల్ టీంకే సోనియా పట్టం!

    రాష్ట్రాల్లో ఎప్పుడైతే లాక్‌డౌన్‌ షురూ అయిందో అప్పటి నుంచి పూర్తిస్థాయిలో ఆదాయం కోల్పోయాయి. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే తెలంగాణ రాష్ట్రం 83 శాతం ఆదాయం లాస్‌ అయింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతలా బాగోలేదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ వివరాల ప్రకారం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో రాష్రంలో ఆదాయంతో పోలిస్తే ఖర్చు ఎక్కువగా ఉంది. ఐదు నెలల ఆదాయం రూ.37,305.79 కోట్లు కాగా.. ఖర్చు రూ. 88,618.19 కోట్లు. దీంతో లోటు రూ. 51,312.40 కోట్లకు చేరింది.

    భారత్ ఆర్థిక వ్యవస్థ మైనస్ లలోకి జారిపోతోందని అన్ని సంస్థలు హెచ్చరిస్తున్న తరుణంలో.. ప్రపంచంలోనే ప్రఖ్యాత ఆర్థిక సంస్థ తాజాగా భారత ఆర్థిక వ్యవస్థపై అంచనాలను విడుదల చేసింది. తాజాగా ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్’ కరోనా లాక్ డౌన్లు భారత ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపినట్లు మూడీస్ అభిప్రాయపడింది.  2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ రేటుకు భారీ కోత విధించింది. ఏకంగా -11.5 శాతం మేర కుచించుకుపోనుందని  అంచనావేసింది. లాక్ డౌన్ వల్ల భారత జీడీపీ తీవ్ర ప్రభావానికి లోను కాగా.. 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలను -11.5గా లెక్కగట్టింది.

    Also Read: మాఫియా డాన్ దావూద్ గ్యాంగ్ తో అక్షయ్ కు సంబంధాలు?

    ముందుగా -4శాతం అంచనావేయగా.. తొలి త్రైమాసికం ఫలితాల తర్వాత దానిని -11.5శాతంగా అంచనా వేసింది. మొదట అంచనావేసి ఇప్పుడు దానిని సవరించి గత అంచనాలతో పోలిస్తే రెండింతల కంటే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

    ప్రపంచంలోనే  అత్యల్ప వృద్ధి రేటు నమోదైన దేశాల్లో భారత్ ఒకటి అని మూడీస్ తెలిపింది. భారత్ తోపాటు బ్రిటన్ , స్పెయిన్ లలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మూడీస్ సంస్థ తెలిపింది. చైనా మాత్రమే +3.2శాతంతో ఆర్థికంగా కోలుకుందని తెలిపింది.  లాక్ డౌన్ తో ప్రజారవాణా, కొనుగోళ్లపై భారీ ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది.