AP Cabinet Meeting: ఏపీలో క్యాబినెట్ భేటీ నేడు జరగనుంది. కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతోంది. దీంతో కీలక నిర్ణయాలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈనెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. ప్రధానంగా మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్న నేపథ్యంలో.. కొంతమంది మంత్రులకు క్లాస్ పీకుతారని తెలుస్తోంది. హోంమంత్రి పనితీరుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై సైతం పవన్ వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఈసారి పదిమంది కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు. అందులో ఒకరిద్దరు తప్ప మిగతావారు పెద్దగా పనితీరు కనబరచడం లేదు. దీంతో వారికి ప్రత్యేకంగా క్లాస్ తీసుకునే అవకాశం ఉంది. రెండు రోజుల కిందట టిడిపి సభ్యత్వ నమోదు విషయమై సీఎం చంద్రబాబు ఓ యువ మంత్రికి ఫోన్ లో క్లాస్ పీకారు. అయితే ఆ సంభాషణలకు సంబంధించి ఆడియో ఒకటి బయటపడింది. దానిని సాక్షి మీడియాలో ప్రసారం చేశారు. దీనిపై కూడా చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రధానంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో తీసుకోవాల్సిన అంశాలపై క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం సీరియస్ గా జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలపై ఉన్న సమీక్షించే అవకాశం ఉంది.
1. వైసిపి ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. వాటిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉంది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం-1982 రీపిల్ బిల్లు గురించి సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందుకు సంబంధించి కఠినమైన చట్టాలను తెరపై తీసుకురావాలని చూస్తోంది. వాటిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
2. బీసీలకు అగ్ర తాంబూలం ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని క్యాబినెట్ సమావేశంలో తీర్మానించనున్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించనున్నారు.
3. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటివరకు ఇస్తున్న రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచుతూ మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. ఒలింపిక్స్ లో ఏపీకి ప్రాతినిధ్యం వహిస్తూ హాజరయ్యే క్రీడాకారులను మరింత ప్రోత్సహించునున్నారు. ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధిస్తే వారికి ఇచ్చే నజరానాను ఏకంగా ఏడు కోట్ల రూపాయలకు పెంచే అంశం పై చర్చించనున్నారు.
4. ఉమ్మడి విశాఖ జిల్లాలో అర్సలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో.. అందుకు అవసరమైన భూ కేటాయింపుల అంశంపై కూడా చర్చించనున్నారు.
5. ప్రధానంగా జగన్ కుటుంబానికి కేటాయించిన సరస్వతీ పవర్ ప్లాంట్ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉన్న అంశాలపై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే దీనిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ భూముల అంశంపై దృష్టి పెట్టారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Towards sensational decisions ap cabinet meeting today
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com