Amaravati Tourism: అమరావతిలో( Amaravati capital ) శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ,ప్రైవేటు భవనాలకు సంబంధించి పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపు ఆర్థిక రంగానికి సంబంధించి బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాల నిర్మాణం జరుగుతుంది. మరోవైపు కేంద్ర ప్రాజెక్టులు సైతం పట్టాలెక్కనున్నాయి. రైల్వే తో పాటు రవాణా ప్రాజెక్టులు ప్రారంభానికి సన్న హాలు మొదలయ్యాయి. అయితే ఇవే కాదు పర్యాటక రంగంతో పాటు ఆతిథ్య రంగానికి సంబంధించిన నిర్మాణాలు కూడా జరగనున్నాయి. అమరావతిలో 30 శాతానికి పైగా పచ్చదనానికి కేటాయించనున్నారు. అందులోనే నీటితో పాటు గ్రీనరీకి అవకాశం కల్పించనున్నారు. ఇంకోవైపు ఓ 10 వరకు స్టార్ హోటళ్ల నిర్మాణం కూడా జరిపేందుకు శంకుస్థాపనలు కూడా పూర్తయ్యాయి.
పచ్చదనానికి ప్రాధాన్యం..
అమరావతి అంటే కేవలం రాజధాని కాదు. రాజధాని పనులపై వచ్చే వారి కోసం కాదు. సాధారణంగా హైదరాబాద్( Hyderabad) వెళుతున్న వారు రాజధాని పనుల మీద. రామోజీ ఫిలిం సిటీ, చార్మినార్.. ఇలా ఏవేవో పర్యాటక ప్రాంతాలను ప్రత్యేకంగా తిలకించేందుకు వెళుతున్న వారు ఉంటారు. అలాంటి పరిస్థితి అమరావతిలో సైతం కల్పించాలి అన్నది ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది. అందుకే పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తూ పార్కులు, పర్యాటక ప్రాంతాలు నిర్మించాలన్నది ఒక వ్యూహం. పర్యాటకంగా తీర్చిదిద్దితే దేశంలో కూడా ఉత్తమ రాజధానిగా నిలిచే పరిస్థితి ఉంటుంది. అయితే ఏ రాజధానికి వీలులేని, అవకాశం కలగని పరిస్థితులు అమరావతికి ఉన్నాయి. ఎందుకంటే నిర్మాణం జరుపుకుంటుంది ఈ రాజధాని. ఇప్పటివరకు ఒక నగరాన్ని మాత్రమే రాజధానిగా ఎంపిక చేశారు. ఇప్పుడు ఎంపిక చేసి నగరాన్ని నిర్మిస్తున్నారు. కేవలం అమరావతిలో 30% భూభాగాన్ని పచ్చదనం కోసమే వినియోగిస్తారని తెలుస్తోంది.
పదుల సంఖ్యలో స్టార్ హోటల్స్..
మరోవైపు ఆతిధ్యరంగంలో కూడా అమరావతి అగ్రగామిగా నిలవనుంది. భవిష్యత్తులో నగరంగా అవతరించునున్న అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ స్టార్ హోటల్స్ యాజమాన్యాలు ముందుకు వచ్చాయి. దస్పల్లా( daspalla ), నోవాటెల్, తాజ్ వివంతా వందలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో స్టార్ హోటల్స్ నిర్మాణానికి ముందుకు వచ్చాయి. శంకుస్థాపనలు సైతం పూర్తిచేశాయి. 2028 నాటికల్లా వీటిని నిర్మాణం పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఇవి పూర్తయితే వందలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. అయితే అమరావతిలో పర్యాటక రంగంతో పాటు ఆతిధ్యరంగం అభివృద్ధి చెందుతుండడం మాత్రం శుభ సూచికమే. ప్రపంచస్థాయి నగరాల్లో ఈ రెండు రంగాలది మొదటి స్థానం. అటువంటి ఈ రెండు రంగాలు అమరావతిలో ముందుగానే వృద్ధి చెందుతూ ఉండడం శుభపరిణామం.