Eenadu: అటు చంద్రబాబు.. ఇటు రేవంత్ రెడ్డి.. ఈనాడు ఉద్యోగులకు పండగే పండుగ

మార్గదర్శిపై ఒత్తిడి లేదు. ఈనాడుపై ఆంక్షలులేవు.. ప్రియా ఉత్పత్తులపై వేధింపులు లేవు. అపరిమితమైన స్వేచ్ఛ.. ఇబ్బందులు లేకుండా సాగే వ్యాపారం.. ఫలితంగా ఈనాడు ఉద్యోగులు పండగ చేసుకుంటున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 18, 2024 4:41 pm

Eenadu

Follow us on

Eenadu: గత ఐదు సంవత్సరాలలో ఈనాడుకు జగన్ చుక్కలు చూపించాడు. మార్గదర్శిపై సిఐడిని ఉపయోగించాడు.. ఉండవల్లి అరుణ్ కుమార్ కేసులు వేయడం.. జగన్ ప్రభుత్వం స్పందించడం.. ఫలితంగా రామోజీరావుకు బతికి ఉన్నప్పుడు ఉక్కపోత తప్పలేదు. అది కూడా ఆయన చరమాంకంలో ఉండగా సిఐడి అధికారులతో వేధింపులు తప్పలేదు.. దీంతో ఈనాడు ఇటీవల ఏపీ ఎన్నికల్లో అక్షర శరాలు సంధించింది. బహిరంగంగానే జగన్ కు ఓటు వేయొద్దని పిలుపునిచ్చింది. ఉద్యోగులతో టిడిపికి అనుకూలంగా రాతలు రాయించింది. చంద్రబాబు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని.. కాపాడబోరని స్పష్టం చేసింది. ఎన్నికల రోజున ఏకంగా ఫస్ట్ పేజీలో ఎడిటోరియల్ కాలం రాసింది. జగన్ అనే రాక్షసుడిని ఓడించాలని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈనాడు కోరుకున్నట్టుగానే ఏపీలో టిడిపి కూటమి అధికారాన్ని దక్కించుకుంది. ఇది ఈనాడుకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. మార్గదర్శికి జవసత్వాలు లభించేలా చేసింది. అందువల్లే ఈనాడు ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

బోనస్ పెంచింది

ఆంధ్రప్రదేశ్ కంటే ముందు తెలంగాణలోనూ కాంగ్రెస్ రూపంలో అనుకూల ప్రభుత్వం ఏర్పడటం ఈనాడుకు సానుకూల అంశం లాగా పరిణమించింది. అంతకుముందు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పటికీ ఈనాడుకు ఆంధ్రజ్యోతి లాగా ఇబ్బందులు ఎదురు కాలేదు. పైగా రామోజీరావును అరెస్టు చేయించి.. జైల్లో వేయించాలనే ప్రణాళికకు కేసిఆర్ అడ్డుపడ్డారు. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఈనాడు కెసిఆర్ తో ఫ్రెండ్లీ నేచర్ కొనసాగించింది. అటు రేవంత్.. ఇటు చంద్రబాబు ప్రభుత్వాలు ఏర్పడటంతో ఈనాడుకు అన్ని మంచి శకునములే ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో సంస్థ ఉన్నతికి పాటుపడుతున్న ఉద్యోగులకు డబుల్ బోనస్ ప్రకటించింది. వాస్తవానికి ప్రింట్ మీడియాలో లేబర్ యాక్ట్ అమలు చేసే సంస్థగా ఈనాడుకు పేరుంది. ఎంతటి కష్టకాలంలోనైనా వేతనాలు ఇచ్చే సంస్థగా పేరు గడించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో కష్టపడి.. అనుకూల ప్రభుత్వాలు వచ్చేలాగా చేసిన ఉద్యోగులకు ఈనాడు బోనస్ తో పాటు రామోజీ ఫిలిం సిటీ లో విందు వినోదాలు ఏర్పాటు చేసింది. కేవలం ఉద్యోగులు మాత్రమే కాకుండా.. వారి కుటుంబ సభ్యులను కూడా రామోజీ ఫిలిం సిటీలోకి ఆహ్వానిస్తోంది. కొద్దిరోజులుగా ఈ కార్యక్రమం జరుగుతోంది.. ఇది ప్రస్తుతం మీడియా వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇక ఈ జాబితాలో మిగతా యాజమాన్యాలు రావు, రాలేదు. స్థూలంగా చెప్పాలంటే అందులో పని చేస్తున్న ఉద్యోగులవి బాండెడ్ లేబర్ బతుకులు. కనీస వేతనాలు కూడా అందుకోలేని దుస్థితి. రేవంత్, చంద్రబాబు ప్రభుత్వాలు ఏర్పడటం ఈనాడుకు మాత్రమే కాదు, ఆంధ్రజ్యోతికి కూడా లాభదాయకమే. కాకపోతే రాధాకృష్ణ ఎన్నడు కూడా ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచడు. భారీగా జీతాలు ఇవ్వడు. సెంట్రల్ డెస్క్ లో కొంతమందికి ఓచర్ పేమెంట్లు తప్ప..