Johnny Master: జానీ మాస్టర్ నిజంగానే తప్పు చేశాడా..?అందరూ ఒకే కోణం లో ఆలోచిస్తున్నారా..?

సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది చాలా రకాల ఇబ్బందులను ఎదురుకుంటూ మొత్తానికైతే అవకాశాలను అందుకుంటారు. కానీ అనుకోని కారణాల వల్ల వాళ్ళు కొన్ని ఇబ్బందుల్లో ఇరుకుంటే మాత్రం వాళ్ళకి ఉన్న క్రేజ్ మొత్తం పోతుంది...

Written By: Gopi, Updated On : September 18, 2024 4:45 pm

Johnny Master(1)

Follow us on

Johnny Master: సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లాంటివి జరుగుతూనే ఉంటాయనే విషయాలు మనకు తెలిసిందే. ఇక ఇంతకు ముందు కొంతమంది కాస్టింగ్ కౌచ్ ద్వారా చాలా వరకు నష్టపోయామని కొందరు తమను వాడుకొని వదిలేసారు అంటూ మీడియా ముందుకు వచ్చి రచ్చ రచ్చ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ప్రముఖ కొరియోగ్రఫర్ అయిన జానీ మాస్టర్ తన అసిస్టెంట్ ను వేధించాడని ఆమె ఒక కేసును కూడా నమోదు చేసింది. ఇక దాంతో ఒక్కసారిగా తన మీద నెగిటివ్ కామెంట్లైతే పెడుతున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీ ఓ ఏం జరుగుతుంది అనే విషయాలు బయటికి తెలిసేవి కాదు. ఎందుకంటే అప్పట్లో మీడియా అనేది ఇంత ఫాస్ట్ గా లేదు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రిటీలు ఏమేం చేస్తున్నారనే విషయాలు కూడా సామాన్య మానవులకు ఈజీగా తెలిసిపోతున్నాయి. ఇక దాంతో పాటుగా జానీ మాస్టర్ మీద కూడా తన అసిస్టెంట్ కేసు పెట్టింది. ఇక విషయం తెలుసుకున్న కొన్ని మీడియా చానల్స్ జానీ మాస్టర్ దే తప్పు అన్నటుగా కథనాలను వెలువరిస్తున్నారు. నిజనికైతే అక్కడ అసలు ఏం జరిగింది? ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అనే దానిమీద విచారణ ఏమి జరగకుండానే మొత్తం తప్పు జాని మాస్టర్ దే అని కొంతమంది క్లారిటీ ఇచ్చేస్తున్నారు. నిజానికైతే వాళ్ల మధ్య ఏం జరిగింది? వాళ్ల మధ్య ఎలాంటి ఇష్యూస్ అయ్యాయి. వాళ్ళిద్దరూ ఫిజికల్ గా కలిసారా లేదా? ఒకవేళ అలా చేస్తే ఎందుచేత అలా చేయాల్సి వచ్చింది. ఇక ఇన్ని రోజులు కామ్ గా ఉన్న ఆవిడ ఇప్పుడెందుకు కేసు పెట్టాల్సి వచ్చింది అనే విషయాలను ఇద్దరి పర్సెప్షన్ లో ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి.

అలా కాకుండా ఎవరికి వారు వాళ్ళకి నచ్చినట్టుగా కామెంట్లను చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఒకరికి అన్యాయం జరిగిందని మీడియా ముందుకు రాగానే అందరూ వాళ్ళ మీద సానుభూతి చూపిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని మాత్రం ఎవరు పట్టించుకోరు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలామంది దేనికైనా సిద్ధమవుతుంటారు.

మరి ఇలాంటి సందర్భంలో చిన్న చిన్న ఆర్టిస్టులు సైతం ఖరీదైన ఇండ్లల్లో ఉంటూ, కార్లలో తిరుగుతూ ఉంటారు. మరి అలాంటి వారికి పెద్ద పెద్ద ఇండ్లు, కార్లు ఎలా వస్తాయి. అయితే రోజుకు 15000 ఛార్జ్ చేసే నటులు కూడా పెద్ద పెద్ద ఇల్లు, కార్లలో తిరుగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళను మాత్రం ఎవరు పట్టించుకోరు. వాళ్ళు కంప్లైంట్ చేస్తే మాత్రం ఇతరుల మీద నెట్టేసి వాళ్ళదే మొత్తం తప్పు ఉన్నట్టుగా చిత్రీకరిస్తారు.

ఇన్ని రోజుల వరకు వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఒక్కసారిగా చెడిపోవడానికి గల కారణం ఏంటి అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరమైతే ఉంది. దాని ద్వారా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఏ విషయం అయిన రెండు కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత ఒక నిర్ణయానికి రావాలని చాలా మంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…