Tirumala Devotional Songs: తిరుమల( Tirumala) శ్రీవారికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు ఉన్నారు. నిత్యం స్వామి వారి నామస్మరణ చేసుకున్న వారు ఉన్నారు. అందుకే టీటీడీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వేలాదిగా ఉన్న శ్రీవారికి కీర్తనలను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా శ్రీవారి కీర్తనలను ఎక్కువమంది యూట్యూబ్లో వీక్షిస్తుంటారు. ప్రత్యేక యాప్ లను ఆశ్రయిస్తుంటారు. అయితే మధ్య మధ్యలో వచ్చే ప్రకటనలు భక్తులకు విసుగు తెప్పిస్తుంటాయి. అందుకే ఇటువంటి అసౌకర్యాలు లేకుండా.. అంతరాయాలు కలుగుకుండా భక్తి గీతాలను వినే వెసులుబాటు కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం.
అరుదైన కీర్తనలు సైతం..
ప్రస్తుతం శ్రీవారి కీర్తనలకు సంబంధించి 21, 725 అందుబాటులో ఉన్నాయి. తాళపత్ర గ్రంధాల్లో పొందుపరిచిన అరుదైన గేయాలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam) వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు కింద ప్రతినెలా రికార్డ్ అయిన పాటలను విడుదలైన రోజే అందులో పెడుతోంది టిటిడి. భక్తుల కోసమే ఈ ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఈ వెబ్సైట్ ద్వారా శ్రీవారి కీర్తనలను వినవచ్చు.
Also Read: Jagan Bold Statement: జగన్ లో ఆ గంభీరం లేదు… కానీ రాజారెడ్డి కనిపిస్తున్నాడు
ఇలా చేయాలి..
ముందుగా టీటీడీ అధికారిక వెబ్సైట్( official website) ఓపెన్ చేయాలి. అయితే మొదటిసారి సైట్ ఓపెన్ చేసినందుకు గాను మొబైల్ నెంబర్ కు లాగిన్ కావాల్సి ఉంటుంది. పేజీ ఓపెన్ అయ్యాక ఆన్లైన్ బుకింగ్స్ ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ కింద అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, శరణాగతి గద్యము, శ్రీ రామానుజ సహస్రాబ్ది, శ్రీ అన్నమాచార్య ఇతర వాగ్గేయకారులు అనే శీర్షికలు కనిపిస్తాయి. ఒక్కో దానిపై క్లిక్ చేస్తే వందల పాటలు వస్తాయి. వాటిలో కావాల్సిన కీర్తనలను ఎంచుకుంటే అంతరాయం లేకుండా వినొచ్చు. అవసరం అనుకుంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా కీర్తనలు డౌన్లోడ్ అయినట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.
పది లక్షల విరాళం
మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ భక్తుడు భారీ విరాళం ఇచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్ ట్రస్టుకు పది లక్షల రూపాయల విరాళం అందజేశారు ముప్పరాజు జగదీష్( mupparaju Jagdish ), కడూరు విజయలక్ష్మి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు ఆ విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. దాతలను టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అభినందించారు. మరోవైపు శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.