Jabardasth Naresh Love Story: నా ప్రేయసి పెళ్లికి వెళితే ఆమె పెళ్లి పీటల మీద నుండి లేచి వచ్చేసేది అంటూ… తన ప్రేమ వ్యవహారం బయటపెట్టాడు జబర్దస్త్ నరేష్. అయితే తన ప్రేమకథలో ట్విస్ట్ ఏమిటో చెప్పి షాక్ ఇచ్చాడు నరేష్. ఇంతకీ ఆ కథేమిటో చూద్దాం..
Also Read: స్టార్ హీరోలపై హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు, రాత్రికి రమ్మని ఇబ్బంది పెట్టారంటూ సంచలనం
జబర్దస్త్(JABARDASTH) వేదికగా పాపులారిటీ తెచ్చుకున్న బుల్లితెర కమెడియన్స్ లో పొట్టి నరేష్ ఒకడు. హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్ తో పాటు పలువురు టీమ్ లీడర్స్ తో నరేష్(JABARDASTH NARESH) పని చేశాడు. తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయిస్తాడు. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కామెడీ పంచుతున్నారు. నరేష్ కి బుల్లితెర ఆడియన్స్ లో మంచి ఫేమ్ ఉంది. స్పెషల్ ఈవెంట్స్ లో సైతం నరేష్ చేసే స్కిట్స్ నాన్ స్టాప్ నవ్వులు పూయిస్తాయి. కాగా నరేష్ కి సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలు తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి.
నరేష్ కి వివాహమైంది, భార్య మరణించింది అంటూ వార్తలు వచ్చాయి. అలాగే ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోయాడని వార్తలు వచ్చాయి. కాగా నటి సబీనాతో నరేష్ ప్రేమ వ్యవహారం హైలెట్ అయ్యింది. బుల్లితెర షోలలో వీరి రొమాంటిక్ స్కిట్స్ ప్రేక్షకులను అలరించాయి. సబీనా-నరేష్ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుంది. వీరు ప్రేమికులు అంటూ ప్రచారం జరిగింది. కాగా సబీనాతో ప్రేమ వ్యవహారం మీద నరేష్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ సందర్భంగా అసలు విషయం బయటపెట్టాడు.
నరేష్ మాట్లాడుతూ… నా పెళ్లి గురించి ఎవరెవరో ఏదేదో అనుకుంటున్నారు. నిజానికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. మరో రెండేళ్లలో చేసుకుంటాను. అమ్మాయి అందంగా ఉండాలి, మోడ్రన్ గా ఉండాలి అనే ఆశలు లేవు. నా పేరెంట్స్ ని చక్కగా చూసుకునే అమ్మాయి అయితే చాలు. ఆమె పరిశ్రమకు చెందిన అమ్మాయి అయినా.. బయట అమ్మాయి అయినా పర్లేదు. మంచి మనసు కలిగిన అమ్మాయై ఉండాలి. ఇక సబీనా షేక్ తో నా ప్రేమ కేవలం స్కిట్స్ కి మాత్రమే పరిమితం. మా లవ్ ట్రాక్ రోజా గారే క్రియేట్ చేశారు. అది స్కిట్స్ వరకే పరిమితం. మేము నిజమైన ప్రేమికులం కాదు.
Also Read: హైపర్ ఆది వల్లే జబర్దస్త్ వదిలేశా, వెళ్ళేటప్పుడు వేడుకున్నా, అనసూయ సంచలన కామెంట్స్
సబీనా తన పెళ్ళికి నన్ను పిలిచింది. అయితే పెళ్లి గుంటూరులో కావడంతో వెళ్ళలేకపోయాను. ఒక వేళ పెళ్ళికి వెళితే పీటల మీద నుండి లేచి వచ్చేసేదేమో… అని నరేష్ సరదాగా అన్నారు. సబీనాతో తనకు ఎఫైర్ లేదని నరేష్ స్పష్టత ఇచ్చాడు. రష్మీ- సుడిగాలి సుధీర్ ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సక్సెస్ కావడంతో పలు బుల్లితెర ప్రేమ జంటలు పుట్టుకొచ్చాయి. వర్ష-ఇమ్మానియేల్ సైతం బాగా పాప్యులర్ అయ్యారు. నిజానికి వాళ్ళ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు. కేవలం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ప్రేమికులుగా స్కిట్స్ చేస్తారు. అదన్నమాట మేటర్..