Homeఆంధ్రప్రదేశ్‌TTD rules 2026: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. సరికొత్త మార్పులకు టిటిడి శ్రీకారం

TTD rules 2026: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. సరికొత్త మార్పులకు టిటిడి శ్రీకారం

TTD rules 2026: నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విలసిల్లుతున్న తిరుమల తిరుపతి క్షేత్రంలో ఆలయ పాలకమండలి సరికొత్త మార్పులు చేసింది. రోజురోజుకు భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో.. తిరుమల కొండకు చేరుకున్న వారందరికీ స్వామి వారి దర్శనం లభించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. లడ్డు ప్రసాదంలో నాణ్యత పెంచడం.. అన్న ప్రసాదంలోనూ అదే స్థాయి కొనసాగించి భక్తుల మన్ననలు పొందిన తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇప్పుడు సరికొత్త మార్కులకు శ్రీకారం చుట్టింది.

తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేలాదిమంది భక్తులు కొండమీదికి చేరుకుంటారు. అయితే స్వామివారికి వివిఐపి.. విఐపి భక్తుల తాకిడి కూడా అదే విధంగా ఉంటుంది. అందువల్ల సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించడంతోపాటు.. విఐపి భక్తులకు కూడా స్వామివారి దర్శనాన్ని కల్పిస్తూ ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామివారికి పూజలతో పాటు.. దర్శనం కలిగించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనలను పాటిస్తుంది. భక్తుల తాకిడి పెరగడం.. అందరికీ దర్శన భాగ్యం కల్పించాలని ఉద్దేశంతో ఆన్లైన్ బుకింగ్లో మార్పులు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇప్పుడు తాజాగా మరో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. దీనివల్ల తిరుమల కొండకు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు ప్రయోజనం కలుగుతుంది.

శ్రీ వాణి ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో దేవస్థానం అనేక రకాలుగా మార్పులు తీసుకొచ్చింది. గత శుక్రవారం నుంచి కొత్త నిబంధనలను తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీవాణి ట్రస్టుకు పదివేల రూపాయలను విరాళం ఇచ్చిన వారు వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవాలంటే 500 రూపాయలను టికెట్ కోసం అదనంగా చెల్లించాల్సి ఉండేది. శ్రీవాణి ట్రస్ట్ కు విరాళం ఇచ్చిన తర్వాత.. దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉండేది. ఇప్పటికే టికెట్లు అయిపోయినట్టు వెబ్సైట్ చూపించేది. దీంతో భక్తుల నుంచి విపరీతమైన ఫిర్యాదులు రావడంతో.. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్ల బుకింగ్ విషయంలో కీలకమైన మార్పులు చేపట్టింది.

Also Read: వీర సైనిక కుటుంబం విన్నపం.. స్పందించే గుణం పవన్ ది

శ్రీవాణి ట్రస్ట్ కు 10000 రూపాయలు.. విఐపి బ్రేక్ దర్శనానికి 500 రూపాయలు ఒకే ఒకసారి చెల్లించే విధంగా దేవస్థానం మార్పులు తీసుకొచ్చింది. దీనివల్ల టికెట్లు వెంటనే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు టికెట్ల కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే పేమెంట్ గేట్వే కు సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆ బాధ్యతలు అప్పగించింది. ఫలితంగా భక్తులు యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఒకేసారి చెల్లింపులు జరపడానికి అవకాశం ఉంటుంది.

ఇక ఏడాది జనవరి 9 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను అంతర్జాలంలో అందుబాటులో ఉస్తోంది. ప్రతిరోజు 800 టికెట్లను అందుబాటులో ఉంచుతాంది. ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో వీటిని అందుబాటులో ఉంచుతోంది. కేవలం 1+3 భక్తులకు మాత్రమే ఈ టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది.. ఒక ఐడి మీద టికెట్ కనుక బుక్ చేసుకుంటే.. మళ్లీ వారం పాటు అదే ఐడి మీద టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version