Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan responds to soldier family request: వీర సైనిక కుటుంబం విన్నపం.. స్పందించే...

Pawan Kalyan responds to soldier family request: వీర సైనిక కుటుంబం విన్నపం.. స్పందించే గుణం పవన్ ది

Pawan Kalyan responds to soldier family request: గత ఏడాది పహల్గాం దాడిలో ప్రాణాలు వదిలాడు శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మురళి నాయక్( Murali Nayak ). సైన్యంలో ఉంటూ వీరమరణం పొందాడు. మురళి నాయకులు గొప్ప దేశభక్తితో పాటు పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం ఉండేది. రైల్వేలో ఉద్యోగం కాదనుకొని దేశంపై ఉన్న మమకారంతో సైన్యంలో చేరాడు మురళి నాయక్. కానీ సరిహద్దుల్లో చొరబాటుదారులను నియంత్రించే క్రమంలో హతం అయ్యాడు. చిన్న వయసులోనే వీరమరణం పొందాడు. మురళి నాయక్ అంత్యక్రియలకు స్వయంగా హాజరయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 50 లక్షల నగదు తో పాటు ఐదు ఎకరాల భూమిని కూడా అందించారు. తాను సొంతంగా మరో 25 లక్షల రూపాయలను సమకూర్చారు. స్వయంగా మురళి నాయక్ తల్లిదండ్రులను భుజం తట్టి నేను ఉన్నాను అంటూ భరోసా కల్పించారు. అందుకే ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నారు. దానిని మన్నించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ పై ఉంది.

ప్రత్యేక విన్నపం
మురళి నాయక్ మృతి చెంది ఏడాది పూర్తవుతున్న తరుణంలో ఏప్రిల్ 14న కుటుంబ సభ్యులు వైకుంఠ సమారాధన ఏర్పాటు చేశారు. మురళి నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తమ కుమారుడికి ఎంతో ఇష్టమని.. వైకుంఠ సమారాధనకు వచ్చి పవన్ కళ్యాణ్ నివాళులు అర్పిస్తే కుమారుడి ఆత్మకు శాంతి చేకూరుతుందని వారు విజ్ఞప్తి చేశారు. అందుకే పవన్ కళ్యాణ్ కచ్చితంగా హాజరైతే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏడాది కిందట పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఇప్పుడు వారు పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఉండే మార్గాలు తెలియక సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. కచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ వరకు వెళ్తుందని.. ఆయన తప్పకుండా స్పందిస్తారని పవన్ అభిమానులు చెబుతున్నారు.

పవన్ మంచి అలవాటు..
పవన్ కళ్యాణ్ కు( deputy CM Pawan Kalyan) ఒక మంచి అలవాటు ఉంది. ఎవరికైనా హామీ ఇచ్చినా.. అండగా ఉంటానని చెప్పినా కచ్చితంగా అది చేసి చూపిస్తారు. జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. రాజధాని ప్రాంతంలోని ఇప్పటంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఆ సమయంలో అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ గ్రామస్తులు టార్గెట్ అయ్యారు. రకరకాల పేరుతో వారిని ఇబ్బంది పెట్టారు అప్పట్లో అధికారులు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గ్రామస్తులను పరామర్శించారు. ఈ తరుణంలో ఓ వృద్ధురాలు జనసేన అధికారంలోకి వస్తే మరోసారి గ్రామాన్ని సందర్శించాలని కోరారు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని మరీ పవన్ ఆ గ్రామాన్ని సందర్శించారు. ఆ వృద్ధురాలిని ఆత్మీయంగా సత్కరించి ఆతిథ్యం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ అదొక్కటే కాదు చాలా విషయాల్లో ప్రజల మనోభావాలకు తగ్గట్టు నడుచుకుంటారు. గిరిజనులు ప్రత్యేకంగా ఆహ్వానించారని అల్లూరి జిల్లాలో మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లారు. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. ఇప్పుడు వీర సైనికుడు మురళి నాయక్ తల్లిదండ్రుల విన్నపాన్ని కూడా పవన్ కళ్యాణ్ కచ్చితంగా వింటారని.. వైకుంఠ సమారాధనకు విచ్చేస్తారని జనసైనికులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో…

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version