https://oktelugu.com/

Trumala Darshan: తిరుమల దర్శనం, సేవల్లో సమూల మార్పులు.. ఎమ్మెల్యేల విన్నపానికి గ్రీన్ సిగ్నల్*

వైసిపి ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. వాటిపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం.సేవలు, దర్శన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 15, 2024 / 01:10 PM IST

    TTD

    Follow us on

    Trumala Darshan: తిరుమల శ్రీవారి దర్శనం, సేవల్లో కీలక నిర్ణయాలు, మార్పులకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యేల నుంచి వచ్చిన డిమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల కోటా పెంచాలని గత కొద్ది రోజులుగా టిడిపి ఎమ్మెల్యేలు కోరుతూ వచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశాల్లో సైతం ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై సీఎం సానుకూలంగా కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో తాజాగా తిరుమల శ్రీవారి దర్శన, సేవల్లో ఎమ్మెల్యేల కోటా పెంపునకు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ బోర్డు సమావేశంలో అధికారికంగా ఆమోదముద్ర వేయనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతోంది. టీటీడీ ట్రస్ట్ బోర్డు సైతం ఏర్పాటు అయింది. దీంతో వడివడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భక్తులకు సంబంధించిన సైతం కీలక నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి మార్గంలో రోజుకు 14 వేల టోకెన్లు, శ్రీవారి మెట్టులో ఆరు వేలు జారీ చేయాలని 2017 టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయం తీసుకున్నారు.కానీ కరోనా పేరుతో గత ప్రభుత్వం వాటిని నిలిపివేసింది.ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలో 6000 టోకెన్లను అందిస్తున్నారు. తాజా నిర్ణయంతో అలిపిరిలో సైతం వీటిని పునరుద్ధరించనున్నారు. గతంలో తిరుపతిలోని శ్రీనివాసంలో రోజుకు 1500 చొప్పున స్పెషల్ ప్రవేశ దర్శనం, ఎస్సీ డి టికెట్లను జారీ చేసేవారు. ప్రతి ధర్మకర్తల మండలి సభ్యులకు రోజుకు 20 టిక్కెట్లను ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఈ టిక్కెట్ల ప్రక్రియ పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది. తిరుమల లో ఇచ్చే ఆఫ్లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

    * 18న ట్రస్ట్ బోర్డు సమావేశం
    టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా టీవీ5 అధినేత బిఆర్ నాయుడు నియమితులైన సంగతి తెలిసిందే. మరో 25 మంది సభ్యులుగా కూడా భర్తీ అయ్యారు. ఈనెల 18న టీటీడీ నూతన బోర్డు తొలి పాలకమండలి సమావేశం జరగనుంది. ఆ సమావేశంలోనే ఎమ్మెల్యేల కోటా పరిమితిని పెంచనున్నారు. ఇకపై వారంలో ఆరు రోజులు పాటు.. రోజుకు ఆరు చొప్పున సుపధం టిక్కెట్లు ఇవ్వనున్నారు. అయితే గతం నుంచి ఎమ్మెల్యేలు ఇదే డిమాండ్ తో ముందుకు సాగారు. కానీ వైసీపీ ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే అప్పట్లో వైసీపీ కీలక నేతల విషయంలో అనేక మినహాయింపులు ఉండేవి. దీంతో సామాన్య ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేసేవారు. ఇప్పుడు అదే పరిస్థితి లేకుండా ఎమ్మెల్యేల సిఫారసు లేఖల కోటాను పెంచుతూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.