https://oktelugu.com/

Thalliki Vandanam: తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్.. మంత్రి ప్రకటన

పిల్లల చదువుకు సాయంపై స్పష్టత వచ్చింది. ఈ మేరకు ఏపీ మంత్రివర్గంలో కీలక నేత ఒకరు స్పష్టమైన ప్రకటన చేశారు.

Written By:
  • Dharma
  • , Updated On : January 4, 2025 / 09:32 AM IST

    Thalliki Vandanam

    Follow us on

    Thalliki Vandanam: సూపర్ సిక్స్ పథకాల హామీపై దృష్టి పెట్టింది కూటమి సర్కార్. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో కొన్ని పథకాలపై క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం అందించాలని చూస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పెంచి అమలు చేస్తోంది. ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పథకానికి కూడా శ్రీకారం చుట్టింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ తో పాటు తల్లికి వందనం అమలు చేస్తామని చెబుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు ఏడు నెలలు గడుస్తోంది. దీంతో తల్లికి వందనం కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖరీఫ్ సీజన్ ముగిసింది. ఇప్పుడు రవి నడుస్తోంది. కానీ ఇంతవరకు అన్నదాత సుఖీభవ సాయం అందించలేదు. మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు పథకాల విషయంలో కొంత స్పష్టత వచ్చింది.

    * ఈ విద్యా సంవత్సరానికి లేనట్టే
    అయితే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తల్లికి వందనం అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ విద్యా సంవత్సరానికి లేనట్టేనని తేలిపోయింది. ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి రూ.15000 చొప్పున చదువుకు సాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఏడు నెలలు అవుతున్న దానిపై క్లారిటీ రాలేదు. ఎట్టకేలకు వచ్చే విద్యా సంవత్సరం ముందు.. ఈ విద్యా సంవత్సరం ముగిశాక అని మాత్రం క్లారిటీ వచ్చింది. దీనిపై మరింత స్పష్టతనిచ్చారు మంత్రి అచ్చెనాయుడు. సూపర్ సిక్స్ పథకాలపై మాట్లాడారు. జూన్ 15లోగా తల్లికి వందనం అందిస్తామని స్పష్టం చేశారు.

    * పీఎం కిసాన్ తో అన్నదాత సుఖీభవ
    ఇంకోవైపు అన్నదాత సుఖీభవ పథకంపై కూడా ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఏటా సాగు ప్రోత్సాహం కింద ప్రతి రైతుకు 20వేల రూపాయల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం పీఎం కిసాన్ తో కలిసి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ఏపీ మంత్రి వర్గం నిర్ణయించింది. పీఎం కిసాన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6000 సాయం అందిస్తోంది. దానికి 14 వేల రూపాయలు జతచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద సాయం అందించనుంది.