https://oktelugu.com/

Chiranjeevi : పార్లమెంట్ చరిత్రలోనే కేవలం చిరంజీవికి దక్కిన గౌరవం ఇది

ఎప్పుడో పదేళ్ల కిందట నాటి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి మంచితనంపై అభిమానులు పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. 

Written By:
  • Dharma
  • , Updated On : May 14, 2023 / 07:27 PM IST
    Follow us on

    Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 44 ఏళ్లుగా ఆయన ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ‘మరో 10 జెనరేషన్లకు ఆయన స్ఫూర్తి’ అనడంలో అతిశయోక్తి లేదు. ఎవరు ఏ పని చేసినా ఒకటి అవసరంతో చేస్తారు.. రెండు ఆకలితో చేశారు. కానీ మెగాస్టార్ మాత్రం ఇష్టంతోనూ, ప్రేమతోనూ చేస్తారు.అందుకే ఆయన ఇప్పటి స్టార్ హీరోలతో సమానంగా రాణిస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే వారికి ధీటుగా సినిమాలు చేస్తున్నారు. కానీ మధ్యలో రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్యూర్స్ చవిచూశారు. అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చానని పశ్చత్తాపం చెందిన సందర్భాలున్నాయి. అయితే రాజకీయాల్లో రాణించలేకపోయినా.. ప్రత్యర్థుల మనసును గెలుపొందడంలో మాత్రం సక్సెస్ అయ్యారు.

    2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఏపీలో 275 స్థానాల్లో పోటీచేసి..కేవలం 18 స్థానాల్లో గెలిచారు. అక్కడి కొద్దిరోజుల్లో ప్రజారాజ్యంను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి పదవిని దక్కించుకున్నారు. తొలుత రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసిన కాంగ్రెస్ పార్టీ తరువాత మంత్రి పదవిని కట్టబెట్టింది. అయితే పర్యాటక ప్రాజెక్టుల విషయంలో చిరంజీవి యాక్టవ్ రోల్ ప్లే చేశారు. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై  ఉన్న అవినీతి ఆరోపణలు చిరంజీవిపై ప్రభావం చూపాయి. దేశవ్యాప్తంగా చాలావరకూ ప్రాజెక్టులు పట్టాలెక్కించడంలో చిరంజీవి సక్సెస్ అయినా అనుకున్న ప్రాచుర్యాన్ని పొందలేకపోయారు.

    యూపీఏ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న చిరంజీవిని ప్రత్యర్థి పార్టీలు సైతం అభినందించిన సందర్భాలున్నాయి. ఇప్పటికీ ప్రధాని మోదీ అభిమానంతోనే చూస్తుంటారు. చిరంజీవి వినయానికి అభిమానిగా మారిపోయారు. అయితే నాడు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న చిరంజీవికి సమాజ్ వాది పార్టీ ఎంపీ జయబచ్చన్ ప్రత్యేకంగా అభినందించారు. చిరంజీవి మంచి నటులు, అంతకంటే మంచి వ్యక్తి అని.. అతనంటే తనకు ఎంతో ఇష్టం, గౌరవమని ప్రకటించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతటి మంచి వ్యక్తి పర్యాటక రంగానికి ఊతమిస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అవినీతి మరక అంటుకుంటుందని చలోక్తి విసిరారు. అయితే ఎప్పుడో పదేళ్ల కిందట నాటి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి మంచితనంపై అభిమానులు పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు.