IPL 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెటర్లపై కాసుల వర్షం కురిపించే కామదేనువు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ ఇది. టి20 హిట్టింగ్ చేయగలిగే ప్లేయర్లకు కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసే ప్రాంచైజీలు ఎన్నో ఉన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ లో కూడా పలువురు క్రికెటర్లను అనేక జట్ల యాజమాన్యాలు కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశాయి. కోట్ల రూపాయలతో కొన్న ఆ ప్లేయర్లు ఎలా ఆడారో మీరు చదివేయండి.
ప్రపంచంలో ఏ క్రికెట్ లీగ్ కు లేనంత క్రేజ్ ఐపీఎల్ కు ఉంది. ఈ లీగ్ లో ప్రపంచంలోనే అన్ని క్రికెట్ దేశాలకు సంబంధించిన క్రీడాకారులు ఆడుతుంటారు. మరి ముఖ్యంగా ఆయా దేశాల్లోనే టాప్ క్రీడాకారులు ఈ లీగ్ లో ఆడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో ఈ లీగ్ కు మరియు ఇతర దేశాల్లో నిర్వహించే లీగల్ కు రానంత క్రేజ్ వస్తోంది. ఈ లీగ్ లో ఆడే క్రికెటర్లు కూడా కోట్లాది రూపాయలను ఆయా ప్రాంచైజీలు ము చెబుతున్నాయి. రికార్డు స్థాయిలో కోట్లాది రూపాయలు పొందిన క్రికెటర్లు కూడా ఈ ఏడాది ఉన్నారు.
ఎవరికి ఎంత ఇచ్చి కొన్నారంటే..?
ఈ ఏడాది ఐపీఎల్ లో పలువురు క్రీడాకారులు కోట్లాది రూపాయలను కొల్లగొట్టారు. విదేశాలకు చెందిన క్రీడాకారుల్లో సామ్ కర్రాన్ ను అత్యధికంగా రూ.18.5 కోట్లు ఇచ్చి పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. ఈ జట్టుకు ఈ సీజన్లో పలు మ్యాచ్ ల్లో కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు కర్రాన్. అయితే అత్యంత ప్రతిభ కలిగిన ఆటగాడిగా మంచి పేరు ఉన్న కర్రాన్ ఈ ఏడాది అద్భుతంగానే రాణించాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ల్లో 216 పరుగులు చేసి ఏడు వికెట్లు కొల్లగొట్టాడు. అలాగే ముంబై ఇండియన్స్ జట్టు కామెరాన్ గ్రీన్ ను అత్యధికంగా రూ.17.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, గ్రీన్ కూడా తనకు లభించిన డబ్బులకు న్యాయం చేసినట్టుగానే ఆడాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన గ్రీన్ 277 పరుగులు చేయడంతోపాటు ఆరు వికెట్లు తీసి జట్టుకు బలమైన ప్లేయర్ గా నిలిచాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.16.25 కోట్ల రూపాయలతో బెన్ స్టోక్స్ ను కొనుగోలు చేసింది. అయితే, ఇప్పటివరకు స్ట్రోక్స్ రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడగా 15 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తరువాత అత్యధిక మొత్తాన్ని ఇచ్చి కొనుగోలు చేసిన జాబితాలో వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ ఉన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రూ.16 కోట్లకు ఈ ఆటగాడిని కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఆడిన 292 పరుగులు చేశాడు. అలాగే, హ్యారీ బ్రూక్ ను రూ.13.25 కోట్లు వెచ్చించి హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్ లు ఆడిన ఈ ఆటగాడు 163 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది.
ఆ ముగ్గురు మినహా చేతులెత్తేసిన ఖరీదైన ఆటగాళ్లు..
ఐపీఎల్ లో కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన విదేశీ ఆటగాళ్లలో ముగ్గురు మాత్రమే తాము తీసుకున్న భారీ మొత్తలకు న్యాయం చేశారు. వీరులో ముందు వరుసలో ఉన్నాడు కామెరాన్ గ్రీన్. 12 మ్యాచ్ ల్లో ఆరు వికెట్లు తీయడంతోపాటు 277 పరుగులు చేసి జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారి ఆదుకున్నాడు. ముంబై జట్టు కీలక ప్లేయర్లలో ఒకడిగా మారాడు. అలాగే పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కర్రాన్ కూడా తాను తీసుకున్న భారీ మొత్తానికి న్యాయం చేశాడనే చెప్పాలి. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ ల్లో 216 పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లు తీసుకొని ఆల్ రౌండర్ గా అదరగొడుతున్నాడు. అలాగే లక్నో జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు నికోలస్ పూరన్. ఇప్పటి వరకు 292 పరుగులు చేసి జట్టుకు ఆపద్బాంధవుడిగా మారాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో భారీ హిట్టింగ్ చేసి అత్యధిక పరుగులు చేసేందుకు దోహదం చేస్తున్నాడు ఈ యువ క్రికెటర్. గతంతో పోలిస్తే ఈ ఏడాది విదేశీ ఆటగాళ్ల మెరుపులు తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. కోట్లాది రూపాయల తీసుకున్న ఎంతో మంది ఆటగాళ్లు తమ జట్టుకు న్యాయం చేయలేకపోయారు. వీరిలో ముందు వరుసలో ఉంటాడు బ్రూక్. హైదరాబాద్ జట్టును ఈ ఆటగాడు నిండా ముంచేశాడు.