Devineni  Avinash : జగన్ పాపం.. దేవినేని అవినాష్ కు శాపం.. విదేశాలకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు!

వైసీపీలో చాలామంది దూకుడు కలిగిన నాయకులు ఉన్నారు.గత ఐదేళ్లుగా వారు రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకునే విధానం ఆందోళన కలిగించింది. కానీ వారే ఇప్పుడు బాధితులుగా మిగులుతుండడం గమనార్హం.

Written By: Dharma, Updated On : August 16, 2024 4:42 pm

devineni avinash

Follow us on

Devineni  Avinash : ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలన్న దేవినేని అవినాష్ కల ఫలించలేదు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం వీచినా.. విజయవాడ తూర్పులో మాత్రం గెలవలేకపోయారు అవినాష్. గత ఐదేళ్ల వైసిపి పాలనలో చాలా దూకుడుగా వ్యవహరించారు. ఇప్పుడు అవే ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తున్నాయి.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడిలో అవినాష్ ప్రధాన పాత్ర పోషించారు అన్నది ఆరోపణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై దృష్టి పెట్టింది. కేసులు కూడా నమోదు చేసింది. ఈ తరుణంలో ఆయనకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. గురువారం రాత్రి ఆయన హైదరాబాదు నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే శంషాబాద్ విమానాశ్రయం ఇమ్మిగ్రేషన్ అధికారులు మంగళగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అవినాష్ పై కేసులు ఉన్నాయని.. విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వద్దని పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులను కోరారు. ఆ వెంటనే అవినాష్ ప్రయాణాన్ని ఎయిర్పోర్ట్ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నారు. అవినాష్ వెనుతిరగక తప్పని పరిస్థితి ఏర్పడింది.టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి చేసిన ఘటనలో దేవినేని అవినాష్ పై కేసు నమోదయింది. ఈ కేసులో పోలీసులు పలువురు నిందితులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంతేకాదు టిడిపి నేత పట్టాభి ఇంటిపై దాడి కేసులు కూడా అవినాష్ పై కేసు నమోదు అయింది. ఈ కేసు దర్యాప్తు సైతం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

* టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి
2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి జరిగింది. వందలాదిమంది టీడీపీ కార్యాలయంలోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. సిబ్బందిపై దాడి చేశారు కూడా. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. టిడిపి నుంచి ఫిర్యాదులు అందినా అప్పటి ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోకపోవడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు విచారణను ముమ్మరం చేశారు. సిసి ఫుటేజ్ ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించారు. అరెస్టులు కూడా చేశారు.

* ఆ నేతల ప్రోత్సాహంతోనే
దేవినేని అవినాష్, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి తదితర నాయకుల ప్రోత్సాహంతోనే ఈ దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడికి సూత్రధారులు వీరేనంటూ తాజాగా కేసులు కూడా నమోదయ్యాయి. ఈ తరుణంలో అవినాష్ తో పాటు వైసిపి కీలక నేతలు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. వీరిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే కోర్టు సూచించింది. అయితే లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో తాజాగా అవినాష్ ను దుబాయ్ వెళ్లకుండా అడ్డుకున్నారు.

* ఎక్కడా దక్కని చాన్స్
దేవినేని అవినాష్ తండ్రి నెహ్రూ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కానీ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. అందుకే దేవినేని అవినాష్ సైతం టిడిపిలో చేరారు. 2019లో గుడివాడ నుంచి అవినాష్ కు చంద్రబాబు చాన్స్ ఇచ్చారు. కానీ ఓడిపోయారు. కొద్ది రోజులకే టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే టిడిపి పై పగ సాధించుకునేందుకు అవినాష్ ను జగన్ పావుగా వాడుకున్నారు. ఈ నేపథ్యంలో జరిగిందే తెలుగుదేశం కేంద్ర కార్యాలయం పై దాడి. ఇప్పుడు దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు యువనేత అవినాష్.