Chandrababu And Revanth Reddy: ఏపీ నుంచి కోరుతున్నవి అవే.. చంద్రబాబు ఎదుట రేవంత్ ప్రతిపాదనలు

ప్రధానంగా విభజన సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని ఇరు రాష్ట్రాలు భావిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఏ రాష్ట్ర ప్రయోజనాల కైనా విఘాతం కలిగితే.. అక్కడ మిగతా రాజకీయ పక్షాలకు అది ప్రచారాస్త్రంగా మిగలనుంది.

Written By: Dharma, Updated On : July 6, 2024 12:44 pm

Chandrababu And Revanth Reddy

Follow us on

Chandrababu And Revanth Reddy: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ఎందుకు హైదరాబాదులోని ప్రజా భవన్ వేదిక కానుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఈ భేటీ ప్రారంభం కానుంది. ఇప్పటికే చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లి వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను కలిశారు. అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి సీఎంల భేటీ పై ఉంది. ఏమాత్రం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగినా.. విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టనున్నాయి. ఇందుకు సిద్ధంగా ఉన్నాయి. అందుకే ఇరు రాష్ట్రాల సీఎంలు జాగ్రత్తగా ఉన్నారు. ముఖ్యంగా సెంటిమెంట్ అధికంగా ఉండే తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు ఎదుట కీలక ప్రతిపాదనలు పెట్టే అవకాశం ఉంది.

ప్రధానంగా విభజన సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని ఇరు రాష్ట్రాలు భావిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఏ రాష్ట్ర ప్రయోజనాల కైనా విఘాతం కలిగితే.. అక్కడ మిగతా రాజకీయ పక్షాలకు అది ప్రచారాస్త్రంగా మిగలనుంది. ఆ రాష్ట్ర సీఎం విలన్ కావడం ఖాయం.ప్రధానంగా సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న షెడ్యూల్ 9, 10 సంస్థలతో పాటు విద్యుత్ సంస్థల బకాయిల పైన చర్చించనున్నారు. అయితే రేవంత్ అనూహ్య ప్రతిపాదనలను చంద్రబాబు ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది. విభజన తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలపబడిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలని కోరేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీ సొంతం. తెలంగాణకు ఆ తీర ప్రాంతంలో భాగం కావాలని కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక అతి పెద్ద పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీడీలో తెలంగాణకు భాగం కావాలని కీలక ప్రతిపాదన పెట్టి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కృష్ణా నదిలో 811 టిఎంసిల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం నదీ పరిహవాక ప్రాంతాల్లో నీటి పంపకాలు జరపాలని రేవంత్ కోరనున్నారు. తెలంగాణకు 558 టీఎంసీల నీటిని కేటాయించాలని ప్రతిపాదించనున్నారు. తెలంగాణకు ఓడరేవులు లేనందున ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులో భాగం కావాలని రేవంత్ డిమాండ్ చేసి అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు పాత బకాయిలపై సైతం ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏపీ విద్యుత్ సంస్థలకు సంబంధించి 25 వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయి. గతంలో చంద్రబాబు సర్కార్ కెసిఆర్ ప్రభుత్వం పై న్యాయపోరాటం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయస్థానంలో పిటిషన్ లను వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు వాటిపై చర్చించనున్నారు. ఏపీకి చెల్లించాల్సిన నిధుల విషయంలో రేవంత్ సానుకూలంగా స్పందించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఉమ్మడి ఆస్తులుగా ఉన్న సిఐడి హెడ్ క్వార్టర్స్, లేక్వ్యూ అతిథి గృహంపైనా చర్చ జరగనుంది. అయితే రాష్ట్ర ప్రయోజనాలకు కచ్చితంగా ముఖ్యమంత్రులు పెద్దపీట వేయాలి. రాజకీయ కారణాలతో ఏమాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న.. రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ గా మారే అవకాశాలు ఉన్నాయి.