Jagan: జగన్ కొంపముంచింది వారే.. ఇప్పుడు వారికే అందలం

ఏదైనా ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు దానిని పక్కన పెడతారు. మరోసారి ఆ పరిస్థితి ఎదురు కాకుండా జాగ్రత్తలు పడతారు. కానీ జగన్ పరిస్థితి అందుకు విరుద్ధం. ఈ ఎన్నికల్లో తన అపజయానికి కారణమైన వ్యవస్థకు జగన్ అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం విశేషం.

Written By: Dharma, Updated On : October 18, 2024 8:55 am

YS Jagan

Follow us on

Jagan: ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. భారీ ఓటమి మూటగట్టుకుంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా తగ్గలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో ఆ పార్టీ బరిలో దిగింది.కానీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. కనీసం 90 స్థానాలతోనైనా అధికారంలోకి వస్తామని భావించింది.ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా..దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి చేదు ఫలితాలు వచ్చాయి.అయితే ఇంతటి ఓటమికి నేతల తీరు కారణం అన్న ఆరోపణలు ఉన్నాయి.ముఖ్యంగా రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థతోనే పార్టీకి భారీ నష్టం వచ్చిందన్న నివేదికలు ఉన్నాయి.ఆ వ్యవస్థ పై పార్టీ శ్రేణులనుంచి కూడా ఫిర్యాదులు భారీగా వచ్చాయి. దీంతో జగన్ సైతం వారి అభిప్రాయంతో ఏకీభవించారు. రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థను తొలగిద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ అదే వ్యవస్థను ప్రారంభించారు. కోఆర్డినేటర్లుగా తాను నమ్మిన వారికి బాధ్యతలు అప్పగించారు.

* అప్పట్లో మంత్రులు డమ్మీ
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్ డమ్మీ అన్న విమర్శ ఉంది. కోఆర్డినేటర్ల హవా నడిచింది. మంత్రుల కంటే ఎమ్మెల్యేలు కోఆర్డినేటర్ల కి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. ఉదాహరణకు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి ఉండేవారు. తరువాత వైవి సుబ్బారెడ్డి వచ్చారు. అప్పట్లో ఉత్తరాంధ్ర నుంచి ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, సీదిరి అప్పలరాజు క్యాబినెట్లో ఉండేవారు. స్పీకర్ గా తమ్మినేని సీతారాం వ్యవహరించేవారు. అయితే రీజనల్ కోఆర్డినేటర్ కు ఉన్న గౌరవం దక్కేది కాదు. ఒకరునియోజకవర్గంలో వేలు పెట్టడానికి వీలులేదు.కానీ రీజనల్ కోఆర్డినేటర్ మాత్రం అన్ని నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలు చూసేవారు. దీంతో మంత్రులకు లేని గౌరవం కోఆర్డినేటర్లకు దక్కేది. పార్టీలో విభేదాలకు అదే కారణం అయ్యింది.

* సామంత రాజులుగా కోఆర్డినేటర్లు
జగన్ సీఎం గా ఉండగా రీజినల్ కోఆర్డినేటర్లు సామంత రాజులుగా వ్యవహరించేవారు.తమకున్న అధికారాలను పక్కదారి పట్టించారన్న విమర్శ ఉంది.ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి.. విశాఖలో భారీగా భూదందాకు పాల్పడ్డారు అన్న ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా వైసీపీకి చెందిన ఎంపీ ఒకరు హై కమాండ్ కు ఫిర్యాదు కూడా చేశారు. ఆ ఫిర్యాదు మేరకు అప్పట్లో విజయసాయిరెడ్డి పై జగన్ చర్యలకు ఉపక్రమించారు. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలనుంచి తప్పించారు. అటు తరువాత వచ్చిన వైవి సుబ్బారెడ్డి పై సైతం భూఆరోపణలు వచ్చాయి. ఇప్పుడైతే సుబ్బారెడ్డిని తప్పించి తిరిగి విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు జగన్. అసలు వద్దనుకున్న వ్యవస్థను జగన్ ఎందుకు ప్రారంభించారు? ఆయన భయం ఏంటి? అనేది చర్చ నడుస్తోంది.

* పార్టీ పర్యవేక్షణకు తప్పదు
ప్రస్తుతం వైసీపీకి వరుసగా నేతలు గుడ్ బై చెబుతున్నారు.అన్ని జిల్లాల్లో సీనియర్ నేతలు సైలెంట్ గా ఉన్నారు.జూనియర్ లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.ఈ తరుణంలో పార్టీ ని ప్రక్షాళన చాలా అవసరం. రీజనల్ కోఆర్డినేటర్లుఉంటే పార్టీపై పర్యవేక్షణ ఉంటుంది. కొన్ని రకాల దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టవచ్చు. మరోవైపు కోఆర్డినేటర్లుగా తన అస్మదీయులని జగన్ నియమించుకున్నారు. దీంతో వారు తనకు విధేయతగా పనిచేస్తారని జగన్ అంచనా వేస్తున్నారు. వారికి సైతం పార్టీపై బాధ్యత ఉంటుంది అని భావిస్తున్నారు.