Bigg Boss Telugu 8: రీ ఎంట్రీ లో పెద్ద మార్పు..సోనియా ని పక్కన పెట్టి ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని తీసుకొస్తున్న బిగ్ బాస్ టీం!

రెమ్యూనరేషన్ విషయం లో భేరాలు కుదరకపోవడంతో సోనియా రీ ఎంట్రీ కష్టమే అని రీసెంట్ గా సోషల్ మీడియా లో ఒక రూమర్ వినిపించింది. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటిసారి ఈమెకు బిగ్ బాస్ టీం వారానికి రెండు లక్షల రూపాయిలు ఇచ్చేందుకు అంగీకరించింది.

Written By: Vicky, Updated On : October 18, 2024 8:36 am

Bigg Boss Telugu 8(61)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ తర్వాత, ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో ఒకరు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తారనే విషయం అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ టీం కి బోలెడంత కంటెంట్ ని ఇచ్చే సోనియా రీ ఎంట్రీ ఇస్తుందని దాదాపుగా అందరికీ అర్థం అయ్యింది. బిగ్ బాస్ టీం కూడా ఆమెని సంప్రదించారు, ఆమె రీ ఎంట్రీ ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. కానీ రెమ్యూనరేషన్ విషయం లో భేరాలు కుదరకపోవడంతో సోనియా రీ ఎంట్రీ కష్టమే అని రీసెంట్ గా సోషల్ మీడియా లో ఒక రూమర్ వినిపించింది. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటిసారి ఈమెకు బిగ్ బాస్ టీం వారానికి రెండు లక్షల రూపాయిలు ఇచ్చేందుకు అంగీకరించింది.

కానీ ఇప్పుడు రీ ఎంట్రీ కోసం ఆమె వారానికి 4 లక్షల రూపాయిలు అడగడంతో బిగ్ బాస్ టీం ఆలోచనలో పడింది. సోనియా అయితే కచ్చితంగా బోలెడంత కంటెంట్ ఇస్తుంది, ఆమెకి ఇచ్చే రెమ్యూనరేషన్ వృధా అవ్వదు అనే అభిప్రాయం బిగ్ బాస్ టీం లో కొంతమందికి ఉంది. మరికొంతమందికి మాత్రం ఇప్పటికే బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు సోనియా కి ఆ స్థాయి రెమ్యూనరేషన్ ఇవ్వడం వృధా అని ఫీల్ అవుతున్నారు. ఈ సీజన్ లో రీ ఎంట్రీ కాన్సెప్ట్ ఉంది కాబట్టి, ఆమెకు బదులుగా ఆదిత్య ఓం ని తీసుకొస్తే ఎలా ఉంటుంది అని కూడా పరిశీలిస్తున్నారు. ఆదిత్య ఓం సరిగ్గా గేమ్ ఆడడం మొదలు పెట్టిన వారంలోనే మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అతనిలో ఆడాలనే ఫైర్ ఉంది కాబట్టి, రీ ఎంట్రీ లో తీసుకొస్తే తక్కువ ఖర్చు తోనే మంచి కంటెంట్ వస్తుందనే ఆలోచనలో ఉన్నారట బిగ్ బాస్ టీం.

వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు హౌస్ లోకి ఈ వీకెండ్ ఎపిసోడ్ లో కానీ, లేదా మరుసటి వారం లో కానీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోనియా వస్తే కచ్చితంగా హౌస్ లో పెనుమార్పులు మనమంతా చూడొచ్చు. హౌస్ లో ఆమె ఉన్నన్ని రోజులు ఆమె చుట్టూనే కంటెంట్ మొత్తం నడిచింది. నెగటివ్ అయ్యినప్పటికీ కూడా హౌస్ రసవత్తరంగా ఉండేది. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత సీజన్ చాలా బాగుంది కానీ, సోనియా లాంటి కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్ వస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్ కి వెళ్తుంది, ఆదిత్య ఓం రీ ఎంట్రీ ఇచ్చిన ఇవ్వకపోయినా ఒక్కటే, బిగ్ బాస్ కి డబ్బులు బొక్క అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుకుంటున్నారు. ఇప్పుడు సోనియా రీ ఎంట్రీ ఇస్తే ఆమె కచ్చితంగా రాయల్ క్లాన్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉంటాయి. అదే కనుక జరిగితే తనకు ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండే నిఖిల్, పృథ్వీ లతో ఎదో ఒక సమయం లో క్లాష్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.