Chandrababu Naidu Alliance : ఎన్నికల్లో పొత్తు అనేది ఉభయతారకంగా ఉండాలి. రెండు పార్టీల ప్రయోజనకారిగా ఉండాలి. కానీ ఇన్నాళ్లూ టీడీపీ పొత్తులతో గరిష్ట రాజకీయాలను పొందగలిగింది. బీజేపీ, వామపక్షాలతో పొత్తు కుదుర్చుకునే క్రమంలో ఒకటి, అరా స్థానాలతో సరిపెట్టుకునేది. ఆ పార్టీలు సైతం టీడీపీకి ఉన్న క్షేత్రస్థాయి కేడర్ తో తమకు ప్రాతినిధ్యం దక్కుతుందని భావించేవి. కానీ ఫస్ట్ టైమ్ పొత్తుల వ్యవహారం టీడీపీకి అంత ఈజీ కాని పరిస్థితి. పొత్తులు అన్నవి తమకు నూరు శాతం లాభంగా ఉండాలని జనసేన కోరుకోవడమే ఇందుకు కారణం. సీట్లు ఇచ్చేమంటే ఇచ్చామని కాదు… తమ కు బలమున్న చోట ఇవ్వాలి. అలా తమ వాళ్ళందరూ గెలవాలన్నది పవన్ వ్యూహం. దీంతో ఇది టీడీపీకి ప్రాణసంకటంగా మారనుంది.
ఏపీలో వైసీపీ, టీడీపీలకు సమానంగా మూడో పొలిటికల్ ఆల్టర్నేషన్ గా జనసేన ఉండాలి. అందుకోసమే పొత్తుల ఎత్తుగడలు. ఈ విషయాన్ని పవన్ ఓపెన్ గానే చెబుతున్నారు. పొత్తుల ద్వారా ఎదిగిన రాజకీయ పార్టీలు చాలానే ఉన్నాయి. అందుకే పొత్తులు పెట్టుకుంటున్నామని పవన్ బాహటంగానే చెబుతూ వస్తున్నారు. ఫుల్ క్లారిటీతోనే మాట్లాడుతున్నారు. అటువంటి పవన్ ఏవో ఊరకే కొన్ని సీట్లు తీసుకొని సరిపుచ్చుకుంటారంటే పొరబడినట్టే. ప్రస్తుతం టీడీపీకి జనసేన అవసరమే ఎక్కువ. పవన్ గ్లామర్ తోడైతే సునాయాసంగా గట్టెక్కగలమన్న ధీమా చంద్రబాబులో కనిపిస్తోంది.
పొత్తుల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు తీసుకోవాలని జనసేన భావిస్తోంది. తెలుగుదేశాని కి ఇది పెద్ద చిక్కుగా ఉంది. దీంతో ఆ పార్టీ లోని సీనియర్లు ఇపుడు గొంతు విప్పి తమదే సీటు అని ప్రకటించుకోవడం పట్ల చర్చ సాగుతోంది.జనసేనలో నాదేండ్ల మనోహర్ విషయంలో ఇటువంటిదే బయట పడింది. మనోహర్ జనసేనలతో కీలక నేత. సొంత సీటు గుంటూరు జిల్లా తెనాలి. ఆయన అక్కడ నుంచి 2004లో మొదటిసారి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలిచారు. 2009లో రెండో సారి గెలిచారు. అంతకు ముందు 1994లో ఆయన తండ్రి, మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు తెనాలి నుంచే కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అందుకే తెనాలి నుంచి 2024 లో పోటీ చేయాలని మనోహర్ చూస్తున్నారు. ఇటీవల బాహటంగానే తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు.
కానీ తెనాలి సీటును టీడీపీ ఇన్ చార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆశిస్తున్నారు. నాదేండ్ల మనోహర్ తన మనసులో మాట బయటపెట్టారో లేదో.. రాజేంద్రప్రసాద్ తానే 2024లో తెనాలి నుంచి పోటీ చేస్తానంటూ బిగ్ సౌండ్ చేశారు. ఈ సీటు తనదేనని ఆయన చెప్పేశారు. ఒక విధంగా ఆలపాటి గట్టిగానే చెప్పారని అంటున్నారు.దీంతో జనసేన లో తర్జన భర్జనలు మొదలయ్యాయి. నాదెండ్ల మనోహర్ కే సీటు ఇవ్వక పోతే ఇక పొత్తులు ఎందుకు అన్న ప్రశ్న జనసేనలో ఉత్పన్నమవుతోంది. ఎక్కడో బలం లేని ప్రాంతాల్లో జనసేనకు టీడీపీ సీట్లు కేటాయిస్తుందన్న ప్రచారం ఉంది. అయితే అందుకు పవన్ ఒప్పుకుంటారా? అన్నది ప్రశ్న. అందుకే గతంలో బీజేపీ, వామపక్షాల మాదిరిగా పొత్తు ద్వారా కనిష్ట లాభాన్ని అంటగట్టి.. గరిష్ట లాభం పొందుతామంటే చంద్రబాబుకు కుదరని పని అని విశ్లేషకులు సైతం తేల్చిచెబుతున్నారు.