Koya Praveen in Pulivendula: పులివెందులలో( pulivendula ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. అయితే ఇంతటి ఘోర పరాజయానికి కారణం అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేయడమేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. పోలీసులే పసుపు కండువాలు వేసుకొని ఎన్నికలు నిర్వహించారని ఆరోపించింది. జగన్మోహన్ రెడ్డి అయితే తీవ్ర ఫ్రస్టేషన్ లో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పై సంచలన ఆరోపణలు చేశారు.’ ఎవడీ కోయ ప్రవీణ్’ అంటూ ఏక వాక్యంతో సంబోధించారు. ఆయన ఒక్కప్పటి తెలుగుదేశం పార్టీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావుకు సమీప బంధువు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గరికపాటి రామ్మోహన్ రావు బీఆర్ఎస్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు కోయా ప్రవీణ్ తిరువల్లే తాము ఓడిపోయామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అయితే కోయ ప్రవీణ్ లాంటి ఐపీఎస్ అధికారి గతంలో రాజశేఖర్ రెడ్డి కి సైతం ముప్పు తిప్పలు పెట్టించారు. కడప జిల్లా ప్రజల మన్ననలు అందుకున్నారు.
ఓటమి అంచుల దాకా రాజశేఖర్ రెడ్డి..
1978 నుంచి పులివెందుల నియోజకవర్గం వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ) కుటుంబం చేతిలోనే ఉంది. రాజశేఖర్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయాలు చేయడంతో కడప జిల్లా సైతం అతని కనుసన్నల్లో నడిచింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి కడప పార్లమెంట్ స్థానానికి 1989లో పోటీ చేశారు. దాదాపు 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ 1995 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి ఒక్కసారిగా సీన్ మారింది. ఆ ఎన్నికల్లో మరోసారి ఎంపీగా బరిలో దిగారు రాజశేఖర్ రెడ్డి. కానీ ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. దానికి కారణం ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర. పోలీస్ శాఖలో సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అటువంటి వ్యక్తి కడప జిల్లా ఎస్పీగా వెళ్లారు. ఆ సమయంలోనే సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. అయితే రౌడీ షీటర్లు, ఫ్యాక్షనిస్టులు, నేర చరిత్ర ఉన్న వారిని ముందస్తు అరెస్టులు చేశారు. దీంతో రాజశేఖర్ రెడ్డి శిబిరంలో భయం మొదలైంది. ఎప్పుడు రికార్డ్ స్థాయిలో గెలిచే రాజశేఖర్ రెడ్డి మెజారిటీ 5 వేలకు పడిపోయింది. ఒకానొక దశలో ఓడిపోతారని సంకేతాలు వచ్చాయి. చావు తప్పి కన్ను లొట్ట పోయిన విధంగా బయటపడ్డారు రాజశేఖర్ రెడ్డి. అయితే తదనంతర పరిస్థితుల్లో ఉమేష్ చంద్ర కడప జిల్లా నుంచి బదిలీ అయ్యారు. ఆ సమయంలో కడప ప్రజలు ఉమేష్ చంద్రను సన్మానాలతో ముంచెత్తారు. ఆయన సేవలను కొనియాడారు.
Also Read: మహిళలతో కలిసి బస్సులో బాబు, పవన్.. ఈ అరుదైన వీడియో చూడాల్సిందే
కూటమి వచ్చిన వెంటనే డిఐజిగా..
అయితే ఇప్పుడు కోయ ప్రవీణ్( Koya Praveen ) విషయంలో అదే తరహా ప్రచారం నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అప్రధాన్య పోస్టులో ప్రవీణ్ ను ఉంచారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కోయ ప్రవీణ్ ను కర్నూలు రేంజ్ డీఐజీగా నియమించారు. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భయం ప్రారంభం అయింది. పులివెందుల ఉప ఎన్నికల్లో పోలీస్ శాఖ గట్టి చర్యలు చేపట్టింది. పోటీ చేసిన 11 మంది అభ్యర్థులకు భద్రత కల్పించింది. పోలింగ్ కేంద్రాల్లో సైతం భారీ భద్రత పెంచింది. ఇదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తప్పుగా కనిపిస్తోంది. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కనుల్లో ఓటింగ్ జరిగిందని.. ఈ విజయం ఆయనకే సొంతం అని.. ఎక్కడో పశ్చిమబెంగాల్ ఎన్నికల రిగ్గింగ్ వీడియోను పోస్ట్ చేశారు మాజీమంత్రి అంబటి రాంబాబు. జగన్మోహన్ రెడ్డి అయితే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అని చూడకుండా.. ఎవడీ కోయ ప్రవీణ్ అంటూ ఏక వాక్యంతో సంబోధించారు. తనలో ఉన్న ఫ్రస్టేషన్ ను బయట పెట్టుకున్నారు. అయితే పోలీస్ శాఖలు అధికారులు కఠినంగా వ్యవహరించిన ప్రతిసారి.. కొందరు నేతలకు ఇబ్బంది కలగక మానదు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి కి ఉమేష్ చంద్ర ద్వారా నష్టం జరిగితే.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కోయా ప్రవీణ్ ద్వారా జరిగిందని చెప్పవచ్చు.