Pawan Kalyan And YCP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ హెచ్చరికలు వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ స్పందిస్తుంటారు. ఈసారి కూడా అలానే స్పందించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇటీవల హెచ్చరికలు జారీచేసిన సంగతి తెలిసిందే. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీల నిర్వహణ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ అది ప్రైవేటీకరణ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ అంటూ కార్యక్రమాన్ని నిర్వహించింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు జగన్మోహన్ రెడ్డి దీనిపై వినతిపత్రం కూడా అందించారు. ఈ క్రమంలో మెడికల్ కాలేజీల నిర్వహణకు ముందుకు వచ్చే వారిని తమ అధికారంలోకి వస్తే అరెస్ట్ చేస్తామని జగన్ హెచ్చరించారు. కేసులు నమోదు చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. దీనిపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. తాము అధికారంలో ఉన్నామన్న విషయాన్ని గ్రహించుకోవాలని హెచ్చరించారు. ఎప్పుడుకో మీరు అధికారంలోకి వస్తారు కానీ ఇప్పుడు మేం అధికారంలో ఉన్నామన్న విషయాన్ని గ్రహించుకోవాలని స్పష్టం చేశారు. యోగి ఆదిత్యనాథ్ తో పాటు నక్సల్స్ విషయాన్ని ప్రస్తావించారు పవన్.
* మరో 15 ఏళ్ల పాటు కూటమి..
మరో 15 ఏళ్ల పాటు కూటమి( Alliance ) అధికారంలోకి ఉంటుందని పవన్ పదేపదే చెబుతున్నారు. అయితే ఇది ఎంత మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదు. పవన్ కళ్యాణ్ తో పాటు జనసైనికులను అవమానిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబుకు కొమ్ము కాయడమే మీ పని అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నేరుగా స్పందించారు. మరో మూడు ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని స్పష్టం చేశారు.. చంద్రబాబు సమర్థవంతుడైన నాయకుడిగా అభివర్ణిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ నుండి రాజకీయంగా విమర్శలు వచ్చిన ప్రతిసారి పవన్ నోటి నుంచి మరో 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుందన్న మాట వస్తోంది. ఆపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానివ్వనని.. చంద్రబాబు కూటమి నాయకుడు అంటూ తేల్చి చెబుతున్నారు.
* నేరుగా హెచ్చరికలు..
తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. అమరజీవి పేరిట జలజీవన్ మిషన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు చేశారు. వైసిపి గుండాయిజాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి వారికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి వారి ట్రీట్మెంట్ సరిపోతుందని తేల్చి చెప్పారు. దేశంలో నక్సలిజాన్ని ప్రభుత్వాలు అణచివేసాయని.. మీరు ఒక లెక్క అంటూ తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. అయితే జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కెలికిన ప్రతిసారి పవన్ ఇదే మాదిరిగా స్పందిస్తుండడం విశేషం. మౌనంగా ఉంటేనే వైసిపి జోలికి పవన్ వెళ్లడం లేదు. పొరపాటున ఏ మాట అనినా దానికి మూల్యం తప్పదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ నుంచి.