https://oktelugu.com/

Kodali Nani: గుడివాడలో కొడాలి నానికి షాక్ ల మీద షాక్ లు.. 100 కోట్ల స్థలాలు వెనక్కి..

2004 నుంచి కొడాలి నాని గుడివాడలో గెలుస్తూ వస్తున్నారు. 2009 ఎన్నికల్లోనూ గెలిచారు. టిడిపి ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీలోకి ఫిరాయించారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 14, 2024 2:07 pm
    Kodali Nani

    Kodali Nani

    Follow us on

    Kodali Nani: మొన్నటి వరకు గుడివాడ నా అడ్డా అన్నారు కొడాలి నాని. దమ్ముంటే గుడివాడ వచ్చి పోటీ చేయాలని సవాల్ చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎవరు వచ్చినా తన బొచ్చు కూడా పీకలేరని ఎద్దేవా చేసేవారు. గుడివాడలో తన కన్వెన్షన్ సెంటర్ ను తాకలేరని కూడా సవాల్ చేసేవారు. గత ఐదు సార్లు గెలిచేసరికి కొడాలి నాని లో ఈ ధీమా కనిపించేది. కానీ ఆయన ఆరో ప్రయత్నం దెబ్బతింది. గుడివాడ నుంచి ఓటమి ఎదురైంది. దీంతో అక్కడ సీన్ మారింది. కొడాలి నాని గడ్డం గ్యాంగ్ ఆగడాలకు చెక్ పడింది. వారి ఆధీనంలో ఉన్న భూములు ఒక్కొక్కటి బాధితుల చేతుల్లోకి తిరిగి వస్తున్నాయి.

    2004 నుంచి కొడాలి నాని గుడివాడలో గెలుస్తూ వస్తున్నారు. 2009 ఎన్నికల్లోనూ గెలిచారు. టిడిపి ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీలోకి ఫిరాయించారు. 2014 ఎన్నికల్లో గెలిచారు కానీ టిడిపి అధికారంలోకి వచ్చింది. 2019లో గెలిచిన ఆయన జగన్ క్యాబినెట్లో చేరారు. కానీ ఎన్నికల్లో మాత్రం దారుణ పరాజయానికి గురయ్యారు. టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో ఓడిపోయారు. దీంతో కొడాలి నాని సామ్రాజ్యం ఒక్కొక్కటి కుప్పకూలుతూ వస్తోంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి కొడాలి నాని టార్గెట్ అవుతున్నారు. గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత కామెంట్స్ చేయడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి. నేరుగా ఆయన ఇంటి పైనే దాడికి ప్రయత్నించాయి. తెలుగు యువత నేతలు కోడిగుడ్లు విసిరి బయటకు రావాలని సవాల్ కూడా విసిరారు. అప్పటినుంచి కొడాలి నాని స్వరంలో కూడా మార్పు వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టి టిడిపి శ్రేణుల దాడుల నుంచి తమను కాపాడాలని కోరే దాకా పరిస్థితి వచ్చింది.

    గుడివాడలో కొడాలి నాని అనుచరుల చేతిలో ఉన్న భూములను బాధితులు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. కొన్నేళ్ల కిందట గుడివాడ రాజేందర్ నగర్ లో 100 కోట్ల రూపాయల విలువ చేసే 7.66 ఎకరాల స్థలాన్ని నాని అనుచరులు ఆక్రమించుకున్నారు. అధికారంలో వారు ఉండడంతో బాధిత యజమానులు మౌనంగా ఉండి పోవాల్సిన పరిస్థితి. అయితే ఈ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడం, స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భరోసా ఇవ్వడంతో.. కొడాలి నాని అనుచరులు స్థలం చుట్టూ వేసిన ఫెన్సింగ్ ను తొలగించారు. తాత్కాలిక నిర్మాణాలను జెసిబి లతో ధ్వంసం చేశారు. మరోవైపు కొడాలి నానికి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యక్తిగత భద్రతను సైతం ఈ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.ఇప్పటికే కొడాలి నాని,వల్లభనేని వంశీ పై టిడిపి శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఆ ఇద్దరి నేతల అడుగులు ఎలా ఉంటాయి అన్నది తెలియాల్సి ఉంది.