https://oktelugu.com/

Ayyannapatrudu: జగన్ ను చచ్చేదాకా కొట్టాలి.. అయ్యన్నపాత్రుడు సంచలన కామెంట్స్

జగన్ విషయంలో అయ్యన్న వాయిస్ తగ్గలేదు. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడే చీల్చి చెండాడేవారు అయ్యన్న. ఇప్పుడు కూడా జగన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని టిడిపి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 14, 2024 / 02:11 PM IST

    Ayyannapatrudu

    Follow us on

    Ayyannapatrudu: తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒక ఫైర్ బ్రాండ్. పార్టీ పవర్ లో ఉన్నా.. లేకపోయినా బలమైన వాయిస్ వినిపించడంలో ఆయన ముందుంటారు. ఈ ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. కానీ ఆయనకు దక్కలేదు. జూనియర్లకు పెద్దపీట వేశారు. దీంతో అయ్యన్న అసంతృప్తికి గురవుతారని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ లేదని అయ్యన్న తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ హయాంలోనే తాము మంత్రి పదవులు అందుకున్నామని.. అప్పుడు సీనియర్లుగా ఉండే వారు బాధపడ్డారా? అంటూ టిడిపి నాయకత్వం పై విధేయత ప్రదర్శించారు అయ్యన్న. తమకు ఈ వయసులో టిక్కెట్లు ఇవ్వడమే గొప్ప.. మంత్రి పదవులు ఇవ్వకుంటే అసంతృప్తి వ్యక్తం చేస్తామా అని తిరిగి ప్రశ్నించారు.

    జగన్ విషయంలో అయ్యన్న వాయిస్ తగ్గలేదు. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడే చీల్చి చెండాడేవారు అయ్యన్న. ఇప్పుడు కూడా జగన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని టిడిపి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆయనకు జన, కుల బలం తగ్గలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే పూర్తిగా పెకిలించే వరకు నిద్రపోకూడదని సూచిస్తున్నారు. జగన్ కేవలం ఓడిపోయాడని.. చావలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చచ్చేదాకా కొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు విడిచిపెట్టిన తాము కొందరిని విడిచి పెట్టమని… ఇబ్బంది పెట్టిన అధికారుల వివరాలు రాసుకున్నామని.. ముఖ్యంగా టిడిపి కార్యకర్తలను వేధించిన పోలీస్ అధికారులను విడిచిపెట్టే ప్రసక్తి లేదని అయ్యన్న తేల్చి చెప్పారు. ఎదురుగా గొంతు నొక్కితే ఊరుకుంటామా అని ప్రశ్నించారు. అటువంటి వారిని వెంటాడుతామని హెచ్చరికలు పంపారు.

    జగన్ కు తెలంగాణ ప్రభుత్వంలో కొందరు మిత్రులు ఉన్న విషయాన్ని అయ్యన్న గుర్తు చేయడం విశేషం. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు జగన్ కు అత్యంత విధేయులు. పైగా ఒకటే సామాజిక వర్గం. వైసిపి అధికారంలో ఉన్న రోజుల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అస్మదీయ కంపెనీ అన్ని రకాల కాంట్రాక్టులు చేసేది. జగన్ అనుమతితోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో జగన్ గెలుస్తాడని తనకు సమాచారం ఉందని మాజీ సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. అటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పొంగులేటి సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. వీరంతా జగన్ కు విధేయులని అయ్యన్నపాత్రుడు అనుమానం. అందుకే జగన్ విషయంలో ఎటువంటి రాజీ ధోరణి వద్దన్నది అయ్యన్నపాత్రుడు అభిప్రాయం. అయితే చంద్రబాబు మారిన మనిషి అని అయ్యన్నపాత్రుడు చెప్పుకొస్తున్నారు. జగన్ నుంచి అస్మదీయ నేతలు, అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. ప్రస్తుతం అయ్యన్నపాత్రుడు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.