Brought Foul Language: అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోవడం.. అధికారం పోయాక జైలుకు పోవడం.. లేదంటే కేసులు పాలు కావడం.. రాజకీయాల్లో కామన్ అయిపోయింది. ఐదేళ్లపాటు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారీతిన నోటికి పనిచెబితే.. వాటి పర్యావసనాలు మరో ఐదేళ్లు చూడాల్సిన దుస్థితి ఉంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అదే జరుగుతోంది. గత ఆరు నెలల వరకు కూడా ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతున్నది. దాంతో కూటమి ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇష్టారీతిన మాట్లాడిన వారిని టార్గెట్ చేసింది.
ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ అండ చూసుకొని చాలా మంది రెచ్చిపోయారు. ఉన్మాదులుగా, సోషల్ సైకోలుగా మారిన వారందరిపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వారిపై ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తోంది. అధికార పక్షం కనుసన్నలల్లో ఉండి ముందు చూపు లేక.. భవిష్యత్ ఆలోచన లేక శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, రామ్‌గోపాల్ వర్మ ఆ సమయంలో రెచ్చిపోయారు. దాంతో ఇప్పుడు వారంతా కేసుల బారిన పడుతున్నారు. వాటి నుంచి తప్పించుకోలేక అన్నిరకాల దారులు వెతుకుతున్నారు. ఇక శ్రీరెడ్డి అయితే.. లోకేష్‌కు, పవన్ కల్యాణ్‌కు వీడియోలు పెడుతూ బతిమిలాడుకుంటోంది. గత ప్రభుత్వంలోని పెద్దలు చెబితేనే తాను అలా చేయాల్సి వచ్చిందని, తనను, తన కుటుంబాన్ని కాపాడాలంటూ వేడుకుంటోంది. బుద్ధి తక్కువై అప్పుడు రెచ్చిపోయానని, తనను వేధించడం మానాలని, కేసుల నుంచి కాపాడాలని దండాలు పెడుతోంది. అంతేకాదు.. బహిరంగ లేఖలు రాస్తూ కాళ్లబేరానికి పోయింది. అప్పుడు ల కారాలతో కిందకు దిగని ఆమెను విడిచిపెట్టేది లేదంటూ కూటమి నేతలు అంటున్నారు. ఎప్పటికప్పుడు తన ప్రాంతాలను మారుస్తూ రహస్యంగా యాత్రలు చేస్తూ వస్తోంది.
వైసీపీ ఆస్థాన దర్శకుడిగా పేరొందిన రామ్‌గోపాల్‌వర్మ సైతం ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. గత ఐదేళ్లు విధ్వంసంతోనే ఆయన స్నేహం చేస్తూ వచ్చారు. ఇతరులను కించపరిచేలా సినిమాలు తీస్తూ.. వారి వ్యక్తిత్వాన్ని అగౌరవపరిచేలా నీచాతి నీచ పోస్టులు పెడుతూ తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఒక దర్శకుడిగా ఎంతలా పేరు సాధించినా.. గత ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని సృష్టించిన విధ్వంసం ఆయనను మరింత పాతాళానికి తొక్కేసిందనే చెప్పాలి. గత ఐదేళ్లపాటు జగన్ అండను చూసుకొని రెచ్చిపోయిన ఆయన.. ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నాడు. కూటమి నేతలు ఇప్పుడు ఆర్జీవీని వదిలేది లేదంటూ రెచ్చిపోతున్నారు. టీడీపీ, జనసేన పార్టీ నేతలు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో తనకు రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక.. సినీరంగంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పోసాని.. ఇప్పుడు క్యారెక్టర్ లెస్ వ్యక్తిగా మిగిలిపోతున్నారా..? అంటే అవుననే అంటున్నారు కూటమి నేతలు. గత ఐదేళ్లు సోషల్ మీడియాలో కూర్చుండి ఆయన కూసిన కారుకూతలు అన్నీఇన్నీ కావు. వైసీపీ హయాంలో చంద్రబాబు, పవన్‌ను ఉద్దేశించి ఇష్టారీతిన మాట్లాడేందుకు మీడియాలోకి వచ్చారు. పవన్ కుటుంబంలోని మహిళలను, వారి పిల్లలను ఉద్దేశించి నాడు చేసిన వ్యాఖ్యలు కూటమి నేతలుఇంకా మరిచిపోలేదు. ఈ పిచ్చి వాగుడుతో ఆయన మెంటల్ కృష్ణగా మిగిలిపోయారని టాక్ ఉంది. అందుకే.. పోసాని పిచ్చి వదిలించాలంటూ ఏపీ అంతటా పోసాని మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఒకప్పుడు ఇష్టారాజ్యంగా రెచ్చిపోయిన వీరంతా.. ఇప్పుడు కోర్టుల చుట్టూ, జైళ్ల చుట్టూ ‘యాత్ర’లు చేయాల్సిన దుస్థితి వచ్చింది.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: The one who brought foul language the alliance that says it will not leave the so called yatras that are wrong for the ycp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com