Kadiam : నర్సరీలకు( nurseries ) తెలుగు రాష్ట్రాల్లో పెట్టింది పేరు కడియం. రకరకాలైన మొక్కలు ఇక్కడ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి నుంచి మొక్కలు వెళ్తుంటాయి. ఇక్కడి నర్సరీలో అరుదైన మొక్కలు, వృక్షాలు సైతం ఉంటాయి. ఇవి జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు దక్కించుకున్నాయి. ఇక్కడ మొక్కల కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొందరు వస్తుంటారు. అందుకే కడియం నర్సరీల్లో రైతులకు రాబోయే రోజుల్లో మరింత గుర్తింపు తెచ్చేలా.. ప్రపంచవ్యాప్తంగా జరిగే వన పోటీల్లో ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కడియపులంకకు చెందిన ఓ రైతు వినూత్నమైన ప్రయోగం చేశారు. అరుదైన రెండు వృక్షాలను విదేశాల నుంచి తెప్పించారు. ప్రస్తుతం కడియం నర్సరీలో ఆ రెండు చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
* కడియపులంకలో..
కడియం మండలం కడియపులంకలో( kadiyapu Lanka) శివాంజనేయ నర్సరీ ఉంది. ఆ నర్సరీలు అరుదైన మొక్కలతో పాటు వృక్షాలు ఉంటాయి. తాజాగా ఆ నర్సరీ యజమాని పోలరాజు విదేశాల నుంచి రెండు మొక్కలను తెప్పించారు. వీటి వయసు ఏకంగా 135 సంవత్సరాల పై మాటే. ఒక్కొక్క దాని ధర అక్షరాల 35 లక్షల రూపాయలు. ఈ భారీ వృక్షాలను విదేశాల నుంచి సముద్రం మీదుగా షిప్ లో ప్రత్యేక కంటైనర్ లో తీసుకొచ్చారు. మూడు రోజుల కిందట రెండు చెట్లు నర్సరీకి వచ్చాయని పోలరాజు తెలిపారు. అయితే ఈ చెట్లను చూసేందుకు పర్యాటకులు సైతం కడియం కు వస్తుండడం విశేషం.
* దాని ప్రత్యేకతలు ఇవే
135 సంవత్సరాలు ఉన్న ఈ చెట్లు( trees) ప్రత్యేకమైనవి. ఈ చెట్టు పేరు సిల్క్ ప్రోస్.. శాస్త్రీయ నామం ఖురీసియా స్పీసియోస. ఈ రెండు చెట్ల రవాణాకు 75 రోజులు పట్టింది. ఒక్కో చెట్టు రవాణాకు 10 లక్షల ఖర్చు అయ్యింది. ఈ చెట్లను ఎక్కువగా స్టార్ హోటల్స్, విల్లాలు, భారీ భవనాల దగ్గర అలంకరణ కోసం ఉంచుతారు. ఈ చెట్లు ఇంట్లో ఉంటే సిరిసంపదలు కలుగుతాయి అన్నది ప్రగాఢ నమ్మకం. పైగా అరుదైన వృక్ష జాతి కావడంతో.. అంతా మంచి జరుగుతుంది అని నిర్వాహకుడు పాలరాజు చెబుతున్నాడు.
* పర్యాటకుల తాకిడి
అయితే కడియం( kadiyam) లో నర్సరీల సందర్శనకు ఎక్కువ మంది పర్యటకులు వెళ్తుండడం విశేషం. అందులో భాగంగా 70 లక్షల విలువ చేసే ఈ వృక్షాలను చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే త్వరలో మరికొన్ని అరుదైన వృక్షాలు రానున్నాయని నర్సరీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ నర్సరీల నిర్వహణకు సంబంధించి ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధపడుతోంది. ఇందుకు సంబంధించి అమరావతిలో ఇజ్రాయెల్ అంతర్జాతీయ స్థాయి గార్డెన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉంది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రతినిధులు ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది.