https://oktelugu.com/

AP High Court: నోటీస్ ఇవ్వకుండా అనర్హత వేటు.. రాజీనామాలకు ఆమోదం లేదు.. మండలి చైర్మన్ పై ఫిర్యాదులు

ఏపీ శాసనమండలి చైర్మన్ వ్యవహార శైలిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. నోటీస్ ఇవ్వకుండా ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేస్తుంటే.. మరో వైపు కొందరు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేస్తే ఆమోదం తెలపట్లేదు.

Written By:
  • Dharma
  • , Updated On : November 15, 2024 / 12:43 PM IST

    AP High Court

    Follow us on

    AP High Court: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పై అనర్హత వేటును రద్దు చేసింది హైకోర్టు. కనీసం ఆయన అభిప్రాయం తీసుకోకుండా.. నోటీస్ ఇవ్వకుండా అనర్హత వేటు వేయడాన్ని తప్పు పట్టింది. తాజాగా ఎన్నికల కమిషన్ సైతం ఉప ఎన్నిక నోటిఫికేషన్ రద్దు చేయడంతో.. మండలి చైర్మన్ వ్యవహార శైలి ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఈ ఎన్నికల్లో కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఏకపక్ష విజయం. 164 సీట్లతో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచింది కూటమి. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే అనూహ్యంగా శాసనమండలిలో ఆ పార్టీకి బలం ఉంది. దాదాపు 38 మంది శాసనమండలి సభ్యులు వైసీపీకి ఉన్నారు. అదే పార్టీకి చెందిన మోసేన్ రాజు మండలి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అందుకే మండలి ద్వారా రాజకీయాలు చేద్దామని జగన్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ను విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నిలబెట్టారు. కూటమి పోటీ పెట్టకపోయేసరికి ఆయన ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అయ్యారు. శాసనమండలి విపక్ష నేతగా కూడా ఎన్నికయ్యారు. ఈ తరుణంలో శాసనమండలి చైర్మన్ ద్వారా వైసిపి బలం తగ్గకూడదని జగన్ పావులు కదపడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పై వేటు. కానీ అది న్యాయస్థానంలో చెల్లుబాటు కాలేదు. వైసీపీకి చెంపపెట్టు లాంటి తీర్పు వచ్చింది. అయితే రఘురాజు విషయంలో నిర్ణయం తీసుకున్న మండలి చైర్మన్.. వైసిపి తో పాటు ఎమ్మెల్సీలుగా రాజీనామా చేసిన వారి విషయంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. దీనిపైనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

    * కొద్ది నెలల కిందట రాజీనామా
    వైసిపి ఎమ్మెల్సీలుగా ఉన్న కర్రి పద్మశ్రీ, కోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి వంటి వారు పదవులకు రాజీనామా చేశారు. అయితే నెలలు గడుస్తున్న మండలి చైర్మన్ వారి రాజీనామాలను ఆమోదించలేదు. వారిని ఎలాగైనా పార్టీలో ఉంచుకోవాలన్నది వైసీపీ లక్ష్యం. ఇప్పటికే చాలాసార్లు వైసిపి హై కమాండ్ రాయబారం నడిపింది. టిడిపి కూటమిలో ప్రాధాన్యం ఉండదని.. వైసీపీలోనే కొనసాగాలని కోరింది. కానీ ఆ ముగ్గురు నిరాకరిస్తూ రావడంతో వారి రాజీనామాలను పక్కన పెట్టారు మండలి చైర్మన్.

    * కోర్టును ఆశ్రయించే అవకాశం
    తాజాగా విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో కోర్టు భిన్నమైన తీర్పు ఇచ్చింది. అయితే మండలి చైర్మన్ మోసేన్ రాజు వ్యవహార శైలి పై రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహేతుకమైన కారణాలతో, సరైన ఫార్మేట్ తో రాజీనామాలు చేసిన ఆమోదించడం లేదని వారు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అదే జరిగితే కోర్టులో ప్రతికూల తీర్పు వస్తే మాత్రం.. మండలి చైర్మన్ ఇబ్బంది పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.