https://oktelugu.com/

Visakhapatnam: మహిళతో భర్త.. రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన మిస్ వైజాగ్

గతంలో నక్షత్ర అనే వ్యక్తి మిస్ వైజాగ్ టైటిల్ ను గెలుచుకుంది. 2017లో వెంకట సాయి తేజ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. కొన్నేళ్ల పాటు వీరి దాంపత్యం సవ్యంగా సాగింది.

Written By:
  • Dharma
  • , Updated On : May 30, 2024 / 05:04 PM IST

    Visakhapatnam

    Follow us on

    Visakhapatnam: వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల పాటు సవ్యంగా సాగిన వారి కాపురంలో విభేదాలు వచ్చాయి. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తనను కాదని వేరే మహిళతో భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అని ఆమె అనుమానించింది. మీడియాను తీసుకెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. అయితే మహిళ ఆడిషన్ కోసం వచ్చిందని భర్త చెబుతున్నాడు. విశాఖలో వెలుగు చూసిన వివాదాస్పద ఘటన ఇది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

    గతంలో నక్షత్ర అనే వ్యక్తి మిస్ వైజాగ్ టైటిల్ ను గెలుచుకుంది. 2017లో వెంకట సాయి తేజ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. కొన్నేళ్ల పాటు వీరి దాంపత్యం సవ్యంగా సాగింది. తరువాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. అయితే గురువారం నక్షత్ర భర్త మరో మహిళతో కలిసి ఉండగా.. మీడియా ప్రతినిధులను తీసుకెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. దీంతో దంపతులిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే షూటింగ్ ఆఫీసు వద్ద గలాటా జరగడంతో పోలీసులు నక్షత్రను తీసుకెళ్లిపోయారు. తనపై నక్షత్ర తప్పుడు కేసు పెట్టిందని భర్త తేజ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆఫీసుకు యువతీ యువకులు సినిమా అవకాశాల కోసం వస్తుంటారని తేజా చెబుతున్నాడు.

    11 సంవత్సరాల కిందట ఓ సినిమా షూటింగ్ లో నక్షత్రతో సాయి తేజకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. పెళ్లిదాకా దారితీసింది. వివాహ బంధంతో ఒక్కటైన వారు ఎక్కువ రోజులు గడప లేకపోయారు. వారి దాంపత్యంలో విభేదాలు వచ్చాయి. మరో మహిళతో తేజ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. ఆమెనే పెళ్లి చేసుకున్నాడని నక్షత్ర చెబుతోంది. పబ్జి గేమ్ ఆడుతూ అమ్మాయిలను ట్రాప్ చేసే రకమని తేజ పై ఆరోపణలు చేసింది. తనతో సాయి తేజ మాట్లాడిన ఆడియో వీడియోలు ఉన్నాయని కూడా చెప్పుకొస్తోంది. తనకు రోజుకు మహిళ కావాలంటూ తనపై ఒత్తిడి తెచ్చేవాడని చెబుతోంది. భర్త తేజ ఇంటి వద్ద నక్షత్ర ఆందోళనకు దిగడంతో స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.