https://oktelugu.com/

Election Commission: వైసీపీకి ఎలక్షన్ కమిషన్ షాక్

ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. దాదాపు 5 లక్షల వరకు ఓట్లు పోలయ్యాయి. ఎప్పుడు లక్షన్నర దాటని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆ స్థాయిలో నమోదయ్యేసరికి.. అధికార పార్టీలో కలవరం ప్రారంభం అయ్యింది.

Written By:
  • Dharma
  • , Updated On : May 30, 2024 / 05:09 PM IST

    Election Commission

    Follow us on

    Election Commission: వైసీపీకి షాక్ తగిలింది. కౌంటింగ్ కు ముందే ఈసీ కూటమికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఈసీ కీలక ఆదేశాలు ఇచ్చింది. వ్యాలిడ్ ఓట్లపై స్పష్టత ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో చాలాచోట్ల రిటర్నింగ్ అధికారులు సంతకం చేసినా..సీల్ వేయలేదు.కొన్నిచోట్ల హోదా రాయలేదు.దీంతో ఈ ఓట్లన్నీ ఇన్ వ్యాలీడ్ అవుతాయని సందేహాలు ఉండేవి.

    ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. దాదాపు 5 లక్షల వరకు ఓట్లు పోలయ్యాయి. ఎప్పుడు లక్షన్నర దాటని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆ స్థాయిలో నమోదయ్యేసరికి.. అధికార పార్టీలో కలవరం ప్రారంభం అయ్యింది. గత ఐదు సంవత్సరాలుగా జరిగిన పరిణామాలతో ఉద్యోగ ఉపాధ్యాయులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకులుగా మారారు. దీంతో ఈ ఓట్లన్నీ వ్యాలీడ్ గా పరిగణిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అధికార పార్టీ ఒక అంచనాకు వచ్చింది. అందుకే ఎలాగైనా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వీలైనంతవరకు చెల్లుబాటు కాకుండా చూడాలని భావించింది. ఎక్కువ శాతం చెల్లుబాటు కావు అని.., హోదా రాయనిచోట ఆ ఓట్లన్నీ కూటమికి అనుకూలంగా పడినా చెల్లుబాటు కావని.. దీంతో నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని వైసిపి ఆలోచన చేసింది.

    అయితే ఈ ఓట్ల విషయంలో టిడిపి కూటమి ప్రత్యేకంగా అభ్యర్థించింది. చెల్లుబాటు అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ని కోరింది. దీంతో సంతకం ఉన్న ఓట్లు చెల్లిస్తాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టతనిచ్చారు. కౌంటింగ్ రోజున అవి వ్యాలీడ్ ఓట్లుగా గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో వెనుకబడ్డామన్న టెన్షన్ లో ఉన్న వైసిపి ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఆ ఓట్లు చెల్లుబాటు కాకపోతే తనకు లాభం అవుతుందన్న ఉద్దేశంతో అభ్యంతరం చెప్పింది. సీఈవో ఆదేశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. వైసీపీ లేఖ రాసిన నేపథ్యంలో సీఈసీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. రిటర్నింగ్ అధికారి సీల్ లేకపోయినా, హోదా రాయకపోయినా.. గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే చాలు.. అవన్నీ వ్యాలీడ్ ఓట్లేనని ఫుల్ క్లారిటీ ఇచ్చింది. దీంతో వైసిపికి షాక్ తగిలినట్లు అయ్యింది.